Homeచిత్ర ప్రభNaga Chaitanya: ‘వృషకర్మ’ ఈవెంట్‌లో నాగ చైతన్యకు చేదు అనుభవం

Naga Chaitanya: ‘వృషకర్మ’ ఈవెంట్‌లో నాగ చైతన్యకు చేదు అనుభవం

Naga Chaitanya: హీరో నాగ చైతన్యకు చేదు అనుభవం ఎదురైంది. ఆయన నటిస్తున్న లేటెస్ట్‌ మూవీ ‘వృషకర్మ’ గ్లింప్స్‌ విడుదల నేపథ్యంలో ప్రసాద్స్‌ ఐమ్యాక్స్‌ లో ఈవెంట్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన చై సిబ్బంది పోరపాటు వల్ల కుర్చీలోంచి కింద పడిపోయారు. గురువారం (మార్చి 5) ‘వృషకర్మ’ సినిమా ఫస్ట్ గ్లింప్స్ లాంచ్ సందర్బంగా ప్రసాద్‌ ఐమ్యాక్స్‌లో ఈవెంట్‌ని నిర్వహించారు. ఈ నేపథ్యంలో డైరెక్టర్‌తో పాటు చై స్టేజ్ మీదకు వెళ్లాడు.

- Advertisement -

అక్కడ వారి కోసం వేసిన కుర్చీలో నాగ చైతన్య కుర్చునే సమయంలో ఒక్కసారిగా కుర్చీ వెనక్కి దొర్లింది. దీంతో ఆయన కింద పడిపోయారు. వెంటనే అక్కడే ఉన్న సిబ్బంది, బాడీగార్డ్స్‌ ఆయనకు సాయం అందించారు. చైతన్య కూడా చాలా వేగంగా తేరుకుని పైకి లేచాడు. అనంతరం తనకి ఏం కాలేదని, ఆల్‌ రైట్ అంటూ ఫ్యాన్స్‌, మీడియాకి చిరునువ్వుతో సైగ చేశాడు. అనంతరం చిరునవ్వుతో స్పీచ్‌ మొదలుపెట్టాడు. దీంతో అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు.

ఆసక్తి పెంచుతున్న గ్లింప్స్‌..

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఈ రోజు విడుదలైన ‘వృషకర్మ’ గ్లింప్స్‌ బాగా ఆకట్టుకుంటోంది. ఇందులో చై పవర్ఫుల్‌ లుక్‌కి ఫ్యాన్స్‌ ఫిదా అవుతున్నారు. జిమ్‌లో బాగా కష్టపడి ఫుల్‌ ఫిట్‌నెస్‌గా మారాడు. ఇందులో ఒక ట్రెజర్ హంటర్ గా, సిక్స్ ప్యాక్ బాడీతో సరికొత్త లుక్‌లో ఆకట్టుకున్నాడు. తండేల్‌ వంటి బ్లాక్‌బస్టర్‌ తర్వాత నాగ చైతన్య నటిస్తున్న చిత్రమిది. పైగా విరూపాక్ష డైరెక్టర్‌ కార్తిక్‌ దండు దర్శకత్వం వహిస్తుండటంతో మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Also Read: Divvala Madhuri: తనూజ బర్త్‌డే.. దువ్వాడ మాధురి సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌, వీడియో వైరల్‌

గ్లింప్స్‌ చూస్తుంటే ఈ మూవీ నాగ చైతన్య కెరీర్‌లో ఓ మైలు స్టోన్‌గా నిలుస్తుందని ఫ్యాన్స్‌, ఆడియన్స్‌ అంత అభిప్రాయపడుతున్నారు. కాగా ఈ సినిమాలో నాగ చైతన్యకు జోడి మీనాక్షి చౌదరి నటిస్తుండగా.. జయరాం, శ్రీసత్య తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. స్పర్శ్ శ్రీ వాత్సవ విలన్ పాత్ర పోషిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్రం, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి బీవీఎస్‌ఎన్‌ ఎన్ ప్రసాద్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటున్న ఈచిత్రం త్వరలోనే థియేటర్లలోకి రానుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News