Friday, February 13, 2026
Homeచిత్ర ప్రభNaga Chaitanya: శోభిత‌, స‌మంత‌తో నాగ‌చైత‌న్య సెల్ఫీ - వైర‌ల్ అవుతున్న ఫొటో

Naga Chaitanya: శోభిత‌, స‌మంత‌తో నాగ‌చైత‌న్య సెల్ఫీ – వైర‌ల్ అవుతున్న ఫొటో

Naga Chaitanya: టాలీవుడ్ హీరోల్లో నాగ‌చైత‌న్య లైఫ్‌స్టైల్ డిఫ‌రెంట్‌గా ఉంటుంది. సినిమా షూటింగ్‌లు, ఇల్లు త‌ప్ప బ‌య‌ట ఎక్కువ‌గా క‌నిపించ‌రు. ఇత‌ర హీరోల సినిమాల‌ ప్ర‌మోష‌న్స్‌కు నాగ‌చైత‌న్య అటెండ్ అయ్యేది త‌క్కువే. ప్ర‌స్తుతం నాగ‌చైత‌న్య వృష‌క‌ర్మ షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. విరూపాక్ష ఫేమ్ కార్తీక్ వ‌ర్మ దండు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమా షూటింగ్ తుది ద‌శ‌కు చేరుకుంది. ఈ మిస్టిక్ థ్రిల్ల‌ర్‌గా మూవీ వ‌చ్చే ఏడాది ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. వృష‌వ‌ర్మ సెట్స్‌పై ఉండ‌గానే నాగ‌చైత‌న్య మ‌రో సినిమాకు గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చాడు. బెదురులంక ఫేమ్ క్రాక్ డైరెక్ష‌న్‌లో ఓ రొమాంటిక్ థ్రిల్ల‌ర్ మూవీ చేయ‌బోతున్న‌ట్లు టాక్ వినిపిస్తోంది.

- Advertisement -

Also Read- Ms Subbulakshmi Biopic: ఎం.ఎస్ సుబ్బుల‌క్ష్మి బ‌యోపిక్ కోసం రంగంలోకి స్టార్ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌?

ఇటీవ‌లే నాగ‌చైత‌న్య‌, శోభితా ధూళిపాళ్ల ఫ‌స్ట్ వెడ్డింగ్ యానివ‌ర్స‌రీ చేసుకున్నారు. ఏడాది పూర్త‌యిన సంద‌ర్భంగా త‌మ పెళ్లి వీడియోను అభిమానుల‌తో పంచుకున్నారు. తాజాగా భార్య శోభిత‌తో క‌లిసి నాగ‌చైత‌న్య ఓ సెల్పీ దిగాడు. ఈ ఫొటోను శోభిత ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానుల‌తో పంచుకుంది. ఇందులో నాగ‌చైత‌న్య‌, శోభిత‌ల‌తో క‌లిసి స‌మంత కూడా ఉండ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది. స‌మంత అంటే హీరోయిన్ స‌మంత కాదండోయ్‌. శోభిత ధూళిపాళ్ల చెల్లెలు స‌మంత‌. అంటే నాగ‌చైత‌న్య‌కు మ‌ర‌ద‌లు అవుతుంది. భార్య‌, మ‌ర‌ద‌లు ఇద్ద‌రితో క‌లిసి నాగ‌చైత‌న్య ఫొటోల‌కు ఫోజిచ్చారు. నాగ‌చైత‌న్య మ‌ర‌ద‌లు పేరు స‌మంత కావ‌డంతో ఈ ఫొటో సోష‌ల్ మీడియాలో తెగ చ‌క్క‌ర్లు కొడుతోంది.

స‌మంత ధూళిపాళ్ల ఓ డాక్ట‌ర్. అక్క శోభిత కంటే ముందే స‌మంత పెళ్ల‌య్యింది. గ‌త ఏడాది సాహిల్ గుప్తా అనే వ్య‌క్తిని పెళ్లిచేసుకుంది.

హీరోయిన్ స‌మంతను ప్రేమించిన నాగ‌చైత‌న్య 2017లో ఆమెను పెళ్లిచేసుకున్నారు. మ‌న‌స్ప‌ర్థ‌ల కార‌ణంగా 2021లో వీరిద్ద‌రు విడాకులు తీసుకున్నారు. ఈ విడాకుల వ్య‌వ‌హారం అప్ప‌ట్లో టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. స‌మంత‌తో విడాకుల త‌ర్వాత శోభిత‌తో ప్రేమ‌లో ప‌డ్డారు నాగ‌చైత‌న్య. 2024 డిసెంబ‌ర్‌లో నాగ‌చైత‌న్య‌, శోభిత పెళ్లి జ‌రిగింది.

Also Read- Meenakshi Chaudhary: కోలీవుడ్‌లోకి మీనాక్షి చౌద‌రి రీఎంట్రీ – ఈ సారైనా హిట్టు ద‌క్కేనా?

మ‌రోవైపు ఇటీవ‌లే ఫ్యామిలీ మ్యాన్ డైరెక్ట‌ర్ రాజ్ నిడిమోరుతో ఏడ‌డుగులు వేసింది స‌మంత‌. కోయంబ‌త్తూర్‌లోని ఈషా యోగా సెంట‌ర్‌లో రాజ్‌, స‌మంత పెళ్లి జ‌రిగింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News