Homeచిత్ర ప్రభvrushakarma: భయపెడుతున్న 'వృషకర్మ' గ్లింప్స్‌.. అదిరిపోయిన చై లుక్‌!

vrushakarma: భయపెడుతున్న ‘వృషకర్మ’ గ్లింప్స్‌.. అదిరిపోయిన చై లుక్‌!

Vrushakarma Glimpse: అక్కినేని హీరో నాగ చైతన్య నటిస్తున్న లేటెస్ట్‌ మూవీ ‘వృషకర్మ’. విరూపాక్ష ఫేం కార్తిక్‌ దండు దర్శకత్వంలో మైథలాజికల్‌ యాక్షన్‌ అడ్వెంచర్‌ థ్రిల్లర్‌గా ఈ చిత్రం రూపొందుతుంది. మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తోంది. విభిన్న కథాంశంతో వస్తున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగానే ఉన్నాయి. గతేడాది తండేల్‌తో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కొట్టాడు చై. మరోవైపు విరూపాక్షతో తోలి చిత్రంతోనే వందకోట్ల కొల్లగొట్టాడు కార్తిక్ దండు.

- Advertisement -

వీరిద్దరి కాంబోలో వస్తున్న ‘వృషకర్మ’ ఏ రేంజ్‌ లోఉంటుందో అని అప్పుడే అంచనాలు కూడా మొదలయ్యాయి. అయితే కాసేపటి క్రితం విడుదలైన గ్లింప్స్‌ ఉత్కంఠగా సాగింది. పుల్ డార్క్‌ థీమ్‌లో గ్లింప్స్‌ని వదిలారు. ఇక ఇందులో నాగ చైతన్య లుక్‌ బాగా ఆకట్టుకుంటుంది. బీస్ట్‌ మోడ్‌లో చాలా పవర్ఫుల్‌గా కనిపించాడు. గత చిత్రాలతో పోలిస్తే ఆయన బాడీ లాంగ్వేజ్ గ్రేడ్ చాలా ఇంటెన్సివ్‌గా కనిపిస్తున్నాయి.

గ్లింప్స్ ఎలా ఉందంటే..
ఇక గ్లింప్స్‌ విషయానికి వస్తే.. ఓ వ్యక్తి తన నోటి నుంచి గబ్బిలాన్ని పుట్టించి సృష్టి వినాశానికి పూనుకుంటాడు. ఆ గబ్బిలం తాకిన మనిషి ప్రాణాలు వెంటనే గాల్లో కలిసిపోతాయి. అంతటి ప్రమాదకరమైన దుష్టశక్తిని ఆపేందుకు పుట్టినే శక్తి వృషకర్మ(నాగ చైతన్య). ఇదే విషయాన్ని చిన్న డైలాగ్‌తో వివరించాడు డైరెక్టర్‌. ఒక అతేద్రియ శక్తి మెల్కోన్నప్పుడు.. సృష్టి ధర్మం తప్పినప్పుడు.. విధి ఒక వృషకర్మని ఎంచుకుంటుంది అనే వచ్చే ఈ డైలాగ్‌ గూస్‌బంప్స్‌ తెప్పించేలా ఉంది. బ్యాగ్రౌండ్‌లో ఈ డైలాగ్‌ వస్తున్న క్రమంలో స్క్రీన్‌పై నాగ చైతన్య లుక్‌ రివీల్‌ అవుతుంది. ఈ సీన్‌ గ్లింప్స్‌కి హైలెట్‌గా నిలిచింది. కాన్సెప్ట్ పరంగా చూసుకుంటే కథను రివీల్ చేయకుండా ఆడియన్స్‌లో క్యూరియాసిటి పెంచిన వైనం ఆకట్టుకుంటుంది.

చైతూ లుక్ అదుర్స్..
మెయిన్ పాయింట్ బయట పడకుండా చైతు లక్ష్యం సినిమాలో ఏముంటుందనే దాని మీదే ఈ గ్లింప్స్‌లో చూపించారు. ప్రస్తుతం ఈ గ్లింప్స్‌, చైతూ లుక్‌ మూవీపై మంచి బజ్ క్రియేట్‌ చేస్తుంది. అలాగే ఇందులో మీనాక్షి చౌదరి లుక్‌, రోల్‌ కూడా ఆసక్తి కలిగిస్తోంది. దీనికి తోడు అంజనీ లోక్‌నాథ్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ గ్లింప్స్‌కు మరింత ప్రాణం పోసింది. పురాతన కట్టడాలు, గనుల తవ్వకాలు భారీ సెట్టింగులు సినిమా గ్రాండియర్‌ను చాటుతున్నాయి. మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో జయరామ్, స్పర్ష్ శ్రీవాస్తవ, సత్య వంటి తదితర నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్రం, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి బీవీఎస్‌ఎన్‌ ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటున్న ఈచిత్రం త్వరలోనే థియేటర్లలోకి రానుంది.

Also Read: Ustad Bhagat Singh: వారం ముందుగానే థియేటర్లోకి ‘ఉస్తాద్’.. ఉగాదికి బాక్సాఫీసు ఊచకోత!

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News