Naga Chaitanya| అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల వివాహం అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోలో ఏర్పాటు చేసిన ఏఎన్నార్ విగ్రహం ముందు వీరి వివాహం గ్రాండ్ జరిగింది. ఈ వేడుకలు ఇరు కుటుంబసభ్యులతో పాటు మెగాస్టార్ చిరంజీవి, మహేష్ బాబు దంపతులు, రామ్ చరణ్ దంపతులు, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రానా దగ్గుబాటి, అడవి శేష్, అల్లు అరవింద్ దంపతులు హాజరయ్యారు.
చైతన్య, శోభిత మెడలో మూడు ముళ్లు వేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చైతన్య మూడు ముళ్లు వేస్తున్న సమయంలో ఆయన తమ్ముడు అఖిల్ విజిల్ వేస్తూ సంతోషపడ్డారు. అలాగే నాగార్జున, వెంకటేశ్ కూడా భావోద్వేగానికి గురయ్యారు. మరోవైపు శోభిత కూడా ఎమోషనల్ అయ్యారు.
ఈ సందర్భంగా చైతన్య తండ్రి అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) తన సంతోషాన్ని ఎక్స్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు. “శోభిత, చై కలిసి ఈ అందమైన అధ్యాయాన్ని ప్రారంభించడం నాకు ప్రత్యేకమైన, భావోద్వేగ క్షణం. నా ప్రియమైన చైకి అభినందనలు. అలాగే ప్రియమైన శోభితను కుటుంబంలోకి స్వాగతిస్తున్నాను. మీరు ఇప్పటికే మా జీవితాల్లో చాలా ఆనందాన్ని తెచ్చారు. ANR శతజయంతి సంవత్సరానికి గుర్తుగా స్థాపించబడిన ఆయన విగ్రహం ఆశీర్వాదాల క్రింద ఈ వేడుక జరగడం మరింత ప్రత్యేకంగా ఉంది. ఈ ప్రయాణంలో అడుగడుగునా ఆయన ప్రేమ, మార్గదర్శకత్వం మనతో ఉన్నట్లు అనిపిస్తుంది. ఈరోజు మాపై కురిపించిన లెక్కలేనన్ని ఆశీర్వాదాలకు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను” అంటూ ట్వీట్ చేశారు.