Naga Vamsi: టాలీవుడ్‌లో బిజీ ప్రొడ్యూసర్లలో వరుస ప్రాజెక్ట్స్‌తో దూసుకుపోతోన్న నిర్మాత సూర్యదేవర నాగవంశీ మరోసారి ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై స్టార్ హీరోలతో పాటు కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు నిర్మిస్తూ, వరుస ప్రాజెక్టులతో మార్కెట్‌లో తనదైన బ్రాండ్‌ను క్రియేట్ చేసుకున్నారు నాగవంశీ. ఇప్పటివరకు నాగవంశీ నిర్మించిన మెజారిటీ సినిమాలు నైజాం ఏరియాలో ప్రముఖ నిర్మాత డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు ద్వారానే విడుదలవుతూ వచ్చాయి. ఇద్దరి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్, బిజినెస్ అండర్‌స్టాండింగ్ కారణంగా ఈ కాంబినేషన్ చాలా కాలంగా కొనసాగింది. నాగవంశీ సినిమా అంటే నైజాంలో సేఫ్ బిజినెస్ అన్న నమ్మకం ట్రేడ్ వర్గాల్లో బలంగా ఉంది.
Also Read- Vijay – Rashmika: విజయ్, రష్మిక పెళ్లి అని తెగ ఊదరగొట్టారే.. అసలు విషయం ఇదా!
లేటెస్ట్ న్యూస్ ప్రకారం.. నాగవంశీ ఇకపై కొత్త డిస్ట్రిబ్యూషన్ పార్ట్‌నర్‌పై దృష్టి పెట్టినట్లు టాక్ వినిపిస్తోంది. ఇటీవల నైజాం ప్రాంతంలో డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ ప్రారంభించిన అన్నపూర్ణ స్టూడియోస్‌తో కలిసి పని చేసే అవకాశాలను పరిశీలిస్తున్నారనే వార్తలు ఇండస్ట్రీలో చర్చకు దారి తీశాయి. ఇది నిజమైతే.. దిల్ రాజుకు ఇది షాకింగ్ విషయమని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఎందుకంటే రైజింగ్ ప్రొడ్యూసర్ నాగవంశీ సినిమాలు వేరే డిస్ట్రిబ్యూటర్ చేతికి వెళ్లడం వల్ల నైజాం మార్కెట్‌లో దిల్ రాజు ఆధిపత్యంపై ప్రభావం పడే అవకాశం ఉందని ట్రేడ్ సర్కిల్స్ చెబుతున్నాయి.
ఇంతకీ నాగవంశీ ఈ నిర్ణయం వెనుక అసలు కారణాలు ఏమిటనే దానిపై ఇంకా స్పష్టతకు రాలేదు. ఇది పూర్తిగా వ్యాపార పరమైన నిర్ణయమా? లేక తన మార్కెట్‌ను మరింత విస్తరించాలనే వ్యూహంలో భాగమా? అన్నది చూడాల్సి ఉంది. మరోవైపు దిల్ రాజు ఈ భాగస్వామ్యాన్ని కొనసాగించేందుకు మళ్లీ చర్చలు జరుపుతారా? అన్నది కూడా ఆసక్తికరంగా మారింది. మొత్తానికి సూర్యదేవర నాగవంశీ తీసుకున్న ఈ నిర్ణయం నైజాం డిస్ట్రిబ్యూషన్ వర్గాల్లో కొత్త చర్చలకు తెరలేపింది. రాబోయే రోజుల్లో ఈ మార్పు టాలీవుడ్ బిజినెస్‌పై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.
Also Read- Ram Pothineni: ఆర్కా మీద అలిగిన రామ్?.. అందుకే వద్దని అనుకున్నాడా?

