Dhanush – Rajinikanth: అక్కినేని నాగార్జున ఎప్పుడు కొత్త తరానికి ఆదర్శంగా నిలుస్తుంటారు. కొత్తవాళ్ళకి అవకాశం ఇవ్వాలంటే అందరికంటే ముందు ఉండేది నాగార్జుననే. కాబట్టే ఇప్పుడు సంచలన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న రాం గోపాల్ వర్మకి శివ సినిమాతో దర్శకుడిగా అవకాశం ఇచ్చారు. అంతేకాదు, నాగార్జున అనుష్క శెట్టి, ఆయేషా టాకియా, గ్రేసీ సింగ్ లాంటి చాలామంది కొత్త అమ్మాయిలని హీరోయిన్‌గా ఇండస్ట్రీకి పరిచయం చేశారు.
ఇక నాగ్ ఏజ్ కి తగ్గట్టుగా సినిమాలను ఎంచుకుంటున్నారు. ఒకరకంగా ఈ విషయంలో సీనియర్ హీరోలకి నాగార్జున ఇన్‌స్పిరేషన్ అని చెప్పాల్సిందే. ఇక కథల విషయంలో నాగార్జున ప్రతీసారి ప్రయోగం చేస్తూనే ఉంటారు. అలా చేసిన సినిమా తాజాగా వచ్చిన కుబేర(Kubera Movie). ఆనంద్, గోదావరి, హ్యాపీడేస్ వంటి సినిమాలతో డైరెక్టర్‌గా శేఖర్ కమ్ముల (Sekhar Kammula) మంచి విజయాలను దక్కించుకున్నారు. తనకంటూ ఓ స్టైల్ ఉందని అనిపించుకున్నారు. అయితే కుబేరతో ఏకంగా పాన్ ఇండియా లెవల్‌లో పెద్ద ప్రయోగమే చేశారు. చాలా సెన్సిటివ్ పాయింట్ ని తీసుకోవడం పెద్ద సాహం అనుకుంటే ఈ సినిమాలో నాగార్జున ని కీలక పాత్రకి ఎంపిక చేసుకోవడం మరో ప్రయోగం.
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, రష్మిక మందన్న (Rashmika Mandanna) కుబేర మూవీలో కీలక పాత్రల్లో నటించారు. నాగ రోల్ ఇందులో చాలా స్పెషల్. ఆయన ఈ పాత్ర ఎంచుకున్నందుకు, తెరపై అద్భుతంగా నటించినందుకు సౌత్ నుంచి మంచి ప్రశంసలు దక్కుతున్నాయి. నాగార్జున తప్ప ఇంకెవరూ ఇలాంటి సాహసం చేయరని చెప్పుకుంటున్నారు. అయితే, ధునుష్ మామ అయిన సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన కూలి (Coolie) సినిమాలోనూ నాగ్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఇలా మామా అల్లుడు సినిమాలలో నాగ్ కీ రోల్ చేయడంపై మంచి కామెంట్సే వస్తున్నాయి.
కుబేర సినిమాతో నాగ్ హిట్ అందుకున్నట్టే. మరి కూలి సినిమాలో ఆయన పాత్ర ఎలా ఉండబోతుంది..రజినీతో కలిసి స్క్రెన్ షేర్ చేసుకుంటే ఆ క్రేజ్ అటు తమిళంలో ఇటు తెలుగులో ఎలా ఉంటుందో..అని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అల్లుడు సినిమాతో నాగ్ ప్రశంసలు అందుకున్నారు. మరి ఆగస్టు 14న మామ సినిమా కూలి రాబోతోంది. కూలీ సినిమాలో నాగ్ పవర్‌ఫుల్ విలన్ పాత్రలో కనిపించబోతున్నారు. జైలర్, వెట్టయాన్ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న రజినీ హ్యాట్రిక్ కోసం కూలీ రిలీజ్ విషయంలో ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. చూడాలి మరి ఈ సినిమా నాగార్జునకి ఎలాంటి సక్సెస్ ఇస్తుందో.