Tejaswini: నందమూరి ఫ్యామిలీ నుంచి చాలా మంది వారసులు ఇండస్ట్రీలోకి వచ్చారు. ఎన్టీఆర్ వారసత్వాన్ని సినిమాల్లో బాలకృష్ణ కొనసాగించారు. హరికృష్ణ కూడా కొన్ని సినిమాలు చేశారు. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తాతకు తగ్గ మనవడిగా నిరూపించుకున్నారు. ప్రస్తుతం టాలీవుడ్‌లో టాప్ హీరోల్లో ఒకరిగా కొనసాగుతోన్నారు. తారకరత్న, చైతన్యకృష్ణ కూడా నందమూరి ఫ్యామిలీ నుంచి హీరోలుగా ఎంట్రీ ఇచ్చిన అంతగా సక్సెస్ కాలేకపోయారు. ప్రస్తుతం నందమూరి నాలుగో తరం నుంచి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ తేజతో పాటు ఎన్టీఆర్ అన్న జానకీరామ్ కొడుకు కూడా హీరోగా అరంగేట్రం చేయబోతున్నారు.
ఫస్ట్ టైమ్…
నందమూరి ఫ్యామిలీ నుంచి ఫస్ట్ టైమ్ వారసురాలు కెమెరా ముందుకు వచ్చింది. నందమూరి బాలకృష్ణ కూతురు తేజస్విని యాక్టర్‌గా మారింది. అయితే తేజస్విని నటించింది సినిమానో, వెబ్‌సిరీస్‌లోనో కాదంట. ఓ యాడ్ ఫిల్మ్‌లో నటించినట్లు చెబుతున్నారు. జ్యూవెల్లరీ బ్రాండ్‌కు చెందిన ఈ యాడ్ ఫిల్మ్ షూటింగ్ ఇటీవల హైదరాబాద్‌లో పూర్తయ్యిందట. ఈ యాడ్‌లో తేజస్విని తన యాక్టింగ్‌తో అదరగొట్టిందని టాక్. ఆమె స్క్రీన్ ప్రజెన్స్ అద్భుతమని అంటున్నారు. ఈ యాడ్‌లో నందమూరి తేజస్విని యాక్టింగ్ ఎలా ఉంటుందన్నది అభిమానుల్లో ఆసక్తికరంగా మారింది. ఈ యాడ్ ఫిల్మ్ తర్వాత తేజస్వినికి మరిన్ని అవకాశాలు రావడం ఖాయమని టాక్ వినిపిస్తుంది.
Also Read – Kajal Aggarwal: లాయర్ రోల్‌లో కాజల్ – సైలెంట్‌గా బాలీవుడ్ మూవీ షూటింగ్ కంప్లీట్
అఖండ 2కు ప్రజెంటర్‌గా…
కెమెరా ముందుకు రావడం ఇదే ఫస్ట్ టైమ్ అయినా సినిమా మేకింగ్ విషయంలో మాత్రం తేజస్వినికి ఎక్స్‌పీరియన్స్ చాలానే ఉంది. తండ్రి సినిమాల నిర్మాణంలో గత కొన్నాళ్లుగా చురుకుగా పాలుపంచుకుంటోంది. ప్రస్తుతం బాలకృష్ణ హీరోగా నటిస్తున్న అఖండ 2 సినిమాకు తేజస్విని ప్రజెంటర్‌గా వ్యవహరిస్తోంది. మైథలాజికల్ టచ్‌తో సాగే ఈ యాక్షన్ మూవీకి బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నారు. డిసెంబర్ 5న అఖండ 2 రిలీజ్ కాబోతుంది. అంతకంటే ముందు బాలకృష్ణ అన్‌స్టాపబుల్ షో నిర్మాణ వ్యవహరాలను దగ్గరుండి చూసుకుంది తేజస్విని. సొంతంగా ఓ ప్రొడక్షన్ హౌజ్‌ను లాంఛ్ చేసే ఆలోచనలో తేజస్విని ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
Also Read – BAHUBALI THE EPIC: ‘బాహుబలి ది ఎపిక్’ క్లైమాక్స్ లో ‘బాహుబలి 3’? ఫ్యాన్స్‌కు పండుగే!

