Thursday, March 12, 2026
Homeచిత్ర ప్రభBalakrishna: ఊహించ‌ని కాంబో సెట్ - గ‌బ్బ‌ర్ సింగ్ డైరెక్ట‌ర్‌తో బాల‌కృష్ణ మూవీ

Balakrishna: ఊహించ‌ని కాంబో సెట్ – గ‌బ్బ‌ర్ సింగ్ డైరెక్ట‌ర్‌తో బాల‌కృష్ణ మూవీ

Balakrishna: కొన్నిసార్లు ఊహించ‌ని కాంబినేష‌న్లు సెట్ట‌య్యి ఆడియెన్స్‌ను స‌ర్‌ప్రైజ్ చేస్తుంటాయి. అలాంటి సెన్సేష‌న‌ల్ క‌ల‌యిక ఒక‌టి టాలీవుడ్‌లో కుదిరిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. బాల‌కృష్ణ హీరోగా గ‌బ్బ‌ర్‌సింగ్‌, ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్ సినిమాల ఫేమ్ హ‌రీష్ శంక‌ర్ డైరెక్ష‌న్‌లో ఓ సినిమా రానున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ప్ర‌స్తుతం ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్ సినిమా చేస్తున్నారు హ‌రీష్ శంక‌ర్‌. యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ మూవీ మార్చి 26న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌తో హ‌రీష్ శంక‌ర్ బిజీగా ఉన్నాడు.

- Advertisement -

త‌న త‌దుప‌రి సినిమా కోసం ఓ ప‌వ‌ర్‌ఫుల్ యాక్ష‌న్ స్క్రిప్ట్‌ను హ‌రీష్‌శంక‌ర్ చాలా రోజుల క్రిత‌మే రెడీ చేసుకున్నార‌ట‌. ఇటీవ‌లే బాల‌కృష్ణ‌ను క‌లిసి ఈ క‌థ‌ను వినిపించిన‌ట్లు స‌మాచారం. యూనిక్ పాయింట్‌తో హ‌రీష్ శంక‌ర్ సిద్ధం చేసిన క‌థ‌ బాల‌కృష్ణ‌కు తెగ‌ న‌చ్చింద‌ట‌. ఈ సినిమాకు నంద‌మూరి హీరో ఓకే చెప్పాడ‌ని అంటున్నారు. సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ ఈ భారీ బ‌డ్జెట్ మూవీని నిర్మించ‌బోతున్న‌ట్లు స‌మాచారం.

Also Read – Allu Cinemas: బాలీవుడ్ మూవీతో అల్లు అర్జున్ మ‌ల్టీప్లెక్స్ ఓపెనింగ్ – ట్రోల్ చేస్తున్న నెటిజ‌న్లు

అఖండ 2 త‌ర్వాత గోపీచంద్ మ‌లినేనితో బాల‌కృష్ణ ఓ సినిమా చేయ‌బోతున్నాడు. ఫ్యామిలీ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోన్న ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ మార్చిలో మొద‌లుకానుంది. సంక్రాంతికి ఈ సినిమాను రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు. గోపీచంద్ మ‌లినేనితో సినిమా పూర్త‌యిన త‌ర్వాతే బాల‌కృష్ణ, హ‌రీష్ శంక‌ర్ సినిమా సెట్స్‌పైకి వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు.

మిస్ట‌ర్ బ‌చ్చ‌న్ డిజాస్ట‌ర్‌తో విమ‌ర్శ‌లు ఎదుర్కొన్న హ‌రీష్ శంక‌ర్‌కు ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్ స‌క్సెస్ కీల‌కంగా మారింది. మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో శ్రీలీల‌, రాశీఖ‌న్నా హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. తొలుత ఈ సినిమాను ఏప్రిల్‌లో రిలీజ్ చేయాల‌ని అనుకున్నారు. కానీ రామ్ చ‌ర‌ణ్ పెద్ది పోస్ట్‌పోన్ కావ‌డంతో ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్ మార్చి నెల‌కు షిప్ట‌య్యింది. గ‌బ్బ‌ర్‌సింగ్ బ్లాక్‌బ‌స్ట‌ర్ త‌ర్వాత ప‌వ‌న్ క‌ళ్యాణ్, హ‌రీష్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో వ‌స్తోన్న సెకండ్ మూవీ ఇది.

Also Read – Ranveer Singh: ‘డాన్ 3’ నుంచి రణ్ వీర్ సింగ్ అవుట్? అదే కారణమా!

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News