God Of War: గాడ్ ఆఫ్ వార్ కథతో టాలీవుడ్ టాప్ డైరెక్టర్ త్రివిక్రమ్ ఓ సినిమా చేయబోతున్నట్లు చాలా కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో హీరోగా అల్లు అర్జున్‌తో పాటు ఎన్టీఆర్ పేర్లు వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరిలో త్రివిక్రమ్ గాడ్ ఆఫ్ వార్ ఎవరితో చేయనున్నారన్నది టాలీవుడ్ వర్గాలతో పాటు అభిమానుల్లో ఆసక్తికరంగా మారింది.
తాజాగా త్రివిక్రమ్‌కు పోటీగా గాడ్ ఆఫ్ వార్ కథతో డైరెక్టర్ కిషోర్ తిరుమల ఓ మూవీ చేయబోతున్నారట. ఈ విషయాన్ని తన అప్‌కమింగ్ మూవీ భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రమోషన్స్‌లో బయటపెట్టారు. మైథలాజికల్ టచ్‌తో సాగే ఈ కమర్షియల్ కథ కోసం రెండు సంవత్సరాలు స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నట్లు వెల్లడించారు. కిషోర్ తిరుమల రెడీ చేసిన కథలో హీరో పాత్ర పురాణాల్లోని కుమారస్వామిని పోలి ఉంటుందట. ఈ గాడ్ ఆఫ్ వార్ కథను హీరో నానికి వినిపించారట కిషోర్ తిరుమల. నానికి తెగ నచ్చినట్లు తెలిసింది. ప్యారడైజ్ తర్వాత ఈ సినిమా చేస్తానని డైరెక్టర్‌కు నాని మాటిచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.
Also Read – Jana Nayagan: జననాయగన్ పోస్ట్‌పోన్ కన్ఫామ్ ? – ఓపెన్ కాని బుకింగ్స్
తల్లీ కొడుకుల అనుబంధం నేపథ్యంలో సాగే ఈ సినిమాకు గౌరీతనయ అనే టైటిల్‌ను పరిశీలిస్తోన్నట్లుగా సమాచారం. ఫ్యామిలీ ఎమోషన్స్ ప్రధానంగా సాగుతుందని టాక్ వినిపిస్తోంది. వరుసగా మాస్ సినిమాలు చేస్తున్న తనకు ఓ ఛేంజ్ మాదిరిగా కిషోర్ తిరుమల సినిమా ఉంటుందనే భావనలో నాని ఉన్నట్లు సమాచారం.
కాగా త్రివిక్రమ్ గాడ్ ఆఫ్ వార్ కూడా ఇంచుమించు ఇదే లైన్స్‌తో ఉండబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ ఇద్దరిలో ఎవరి సినిమా ఫస్ట్ సెట్స్‌పైకి వస్తుంది అన్నది ఆసక్తికరంగా మారింది. కిషోర్ తిరుమల దర్శకత్వం వహించిన భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీ జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇందులో రవితేజ, ఆషికా రంగనాథ్, డింపుల్ హయతి హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు.
మరోవైపు నాని హీరోగా నటించిన ప్యారడైజ్ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కయదు లోహర్ హీరోయిన్‌గా నటిస్తోంది. టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్‌బాబు విలన్‌గా కనిపించబోతున్నారు. మార్చి 26న ప్యారడైజ్ రిలీజ్ కాబోతుంది.
Also Read – Army Jobs: నెలకు రూ.1,77,500 జీతంతో ..ఆర్మీలో ఉద్యోగాలు!

