Nani – The Paradise: నేచురల్ స్టార్‌గా పాపులర్ అయిన నాని నటిస్తున్న లేటెస్ట్ సినిమా ది ప్యారడైజ్. ఈ సినిమా రిలీజ్ డేట్ మారుతుందని స్వయంగా నిర్వాత వెల్లడించడం ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలలో ఆసక్తికరమైన చర్చగా మారింది. జెంటిల్ మేన్ నుంచి నాని కాస్త రూటు మార్చాడు. యాక్షన్ సినిమాల మీద ఎక్కువగా దృష్టిసారిస్తున్నాడు. వి, సరిపోదా శనివారం, దసరా, హిట్ 3, ఈ తరహా సినిమాలే. అయితే, నానీకి అన్నీ మాస్ అండ్ యాక్షన్ సినిమాలు సక్సెస్‌లను ఇవ్వడం లేదు.
దసరా సినిమా 100 కోట్ల క్లబ్‌లో చేరింది. కానీ, దానికి ముందు చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్‌గా మిగిలాయి. నిర్మాతగా చేసిన కోర్ట్ సినిమా భారీ లాభాలను తెచ్చిపెడితే, హీరోగా నటించిన హిట్ 3 మాత్రం ఆశించిన విజయాన్ని ఇవ్వలేదనే మాట ఇండస్ట్రీ వర్గాలలో వినిపించింది. ఇక, ఇప్పుడు నాని మరోసారి దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్‌లో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
Also Read- Nidhhi Agerwal: ది రాజాసాబ్‌లో నిధి అగర్వాల్‌కి స్క్రీన్ స్పేస్ అంతేనా? ఇది మరీ దారుణం!
ది ప్యారడైజ్ అనే టైటిల్‌తో రూపొందుతున్న ఈ మూవీలో నాని ‘జడల్’ అనే ఓ వెరైటీ పాత్రలో కనిపించబోతున్నాడు. కంప్లీట్ ఫ్యామిలీ హీరో కాస్త జడల్ పాత్ర కోసం మారిన ట్రాన్స్ఫర్మేషన్ అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఈ సినిమాలో నాని మేకోవర్ చాలా భిన్నంగా ఉంది. ఫస్ట్ లుక్ పోస్టర్ అండ్ గ్లింప్స్ చూస్తేనే నాని.. మరీ కౄరమైన పాత్రలో కనిపిస్తున్నాడని అర్థమవుతోంది.
ఇదే సినిమాలో మంచు మోహన్ బాబు విలన్ పాత్రలో నటిస్తున్నాడు. అలాగే, బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు కూడా బిర్యాని అనే ఓ వెరైటీ పాత్రలో అలరించబోతున్నాడు. వీరి లుక్స్ కూడా మంచి ఆసక్తిని రేకెత్తించాయి. అయితే, ముందు అనుకున్న ప్రకారం మార్చి 26న నాని-ది ప్యారడైజ్ రిలీజ్ అని మేకర్స్ ప్రకటించారు. కానీ, ఇటీవల నిర్మాత ఇప్పటికీ 60 రోజుల షూటింగ్ మాత్రమే జరిగిందని.. ఇంకా 60 రోజుల షూటింగ్ చేయాల్సి ఉందని చెప్పాడు.
Also Read- Chiranjeevi: మన శంకర వరప్రసాద్ గారు హుక్ స్టెప్‌తో రఫ్ఫాడించారు
మార్చి 26న సినిమాను రిలీజ్ చేయడం చాలా కష్టమని చెప్పిన నిర్మాత, సమ్మర్ లో మాత్రం ఖచ్చితంగా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని కన్ఫర్మ్ చేశాడు. జూన్ లేదా జూలై నెలలో ది ప్యారడైజ్ రిలీజ్ ఉంటుందని మరికొన్ని రోజుల్లో కొత్త డేట్‌ని ప్రకటిస్తామని తెలిపాడు. వాస్తవానికి ఒక్కరోజు తేడాతో రామ్ చరణ్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా ‘పెద్ది’ రిలీజ్ ఉంది. ఇప్పుడు నిర్మాత చెప్పినదాన్ని బట్టి పెద్దికి నాని సినిమా పోటీ లేదని క్లారిటీ వచ్చేసింది.

