Homeచిత్ర ప్రభNara Rohit: తండ్రి కాబోతున్న నారా రోహిత్.. భార్య సీమంతం వీడియో వైరల్

Nara Rohit: తండ్రి కాబోతున్న నారా రోహిత్.. భార్య సీమంతం వీడియో వైరల్

Nara Rohit: టాలీవుడ్ హీరో నారా రోహిత్ తండ్రి కాబోతున్నాడు. ఆయన భార్య, నటి శిరీష సీమంతం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది చూసి అభిమానులంత సర్ప్రైజ్ అవుతున్నారు. కాగా ఈ విషయాన్ని ఇప్పటివరకు రోహిత్ ప్రకటించకపోవడం గమనార్హం. కాగా ఆయన భార్య శిరీష ప్రస్తుతం ప్రెగ్నెన్సీతో ఉంది. రీసెంట్‌గా సీమంతం వేడుక జరగ్గా అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

- Advertisement -

అధికారికంగా ఈ విషయాన్ని అయితే ఈ జంట బయటపెట్టలేదు. ‘ప్రతినిధి 2’ మూవీ చేస్తున్న టైంలో ప్రేమలో పడ్డ రోహిత్-శిరీష గతేడాది పెద్దల అంగీకారంతో పెళ్లి బంధంలోకి అడుగుపెట్టారు. 2025 అక్టోబర్ లో వీరి పెళ్లి జరిగింది. పెళ్లయి ఏడాది తిరక్కుండానే ఈ హీరో త్వరలోనే మరో గుడ్ న్యూస్ చెప్పనున్నాడు. ప్రస్తుతం శ్రీజ సీమంత వీడియో వైరల్ కావడంలో అభామానులంత ఖుష్ అవుతున్నారు. ఈ జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు.

నారా రోహిత్ ఒకవైపు వ్యక్తిగత జీవితాన్ని ఎంజాయ్ చేస్తూనే, మరోవైపు తన కెరీర్‌లో కూడా బిజీగా ఉన్నారు. గతేడాది ‘భైరవం’ చిత్రంతో మాస్ ప్రేక్షకులను ఆకట్టుకుని మంచి విజయాన్ని అందుకున్నారు. ప్రస్తుతం విక్టరీ వెంకటేశ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వస్తున్న ‘ఆదర్శ కుటుంబం’ సినిమాలో రోహిత్ ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా ఆయన కెరీర్‌లో మరో మైలురాయిగా నిలుస్తుందని భావిస్తున్నారు. మరోవైపు, తల్లిదండ్రులు కాబోతున్న నారా రోహిత్ దంపతులకు అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Also Read: Evelyn Sharma: పెళ్లయిన ఐదేళ్లకే భర్తతో నటి విడాకులు

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News