Friday, April 4, 2025
Homeచిత్ర ప్రభNara Rohit: నాన్నా.. మీరో ఫైటర్‌.. నారా రోహిత్‌ ఎమోషనల్

Nara Rohit: నాన్నా.. మీరో ఫైటర్‌.. నారా రోహిత్‌ ఎమోషనల్

Nara Rohit| రామ్మూర్తి నాయుడు మృతి పట్ల ఆయన తనయుడు, హీరో నారా రోహిత్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఈమేరకు ఎక్స్ వేదికగా ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.

- Advertisement -

“మీరొక ఫైటర్‌ నాన్నా.. మా కోసం ఎన్నో త్యాగాలు చేశారు. నాన్నా.. నాకు ప్రేమించడం, జీవితాన్ని గెలవడం నేర్పించారు. ఈరోజు నేను ఈ స్థాయిలో ఉండటానికి మీరే కారణం. ప్రజలను ప్రేమించడంతో పాటు.. మంచి కోసం పోరాడాలని చెప్పారు. మీ జీవితంలో ఎన్నో కష్టాలున్నా అవి మా దరి చేరకుండా పెంచారు. నాన్నా.. మీతో జీవితాంతం మరచిపోలేని ఎన్నో జ్ఞాపకాలు మాకున్నాయి. నాకు ఏం చెప్పాలో తోచడం లేదు.. బై నాన్నా’’ అని రాసుకొచ్చారు.

ఇదిలా ఉంటే రామ్మూర్తి నాయుడు పార్థివదేహాన్ని బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి రేణిగుంట విమానాశ్రయానికి ప్రత్యేక విమానంలో తరలించారు. మధ్యాహ్నం రెండు గంటలకు వారి స్వగ్రామం నారావారి పల్లెలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News