Nara Rohith: టాలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్, నారా రోహిత్ త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నాడు. కొన్నాళ్లుగా వాయిదా పడుతూ వస్తున్న ఆయన వివాహ ముహూర్తం తాజాగా ఖరారైనట్లు తెలుస్తోంది.
హీరో నారా రోహిత్, హీరోయిన్ శిరీషల వివాహం ఈ నెల అక్టోబర్ 30న జరగనుంది. ఇప్పటికే ఇరు కుటుంబాల్లో పెళ్లి పనులు ప్రారంభమైనట్లు తెలుస్తోంది. నారా రోహిత్ పెళ్లి చేసుకోబోయే శిరీష, తనతో కలిసి ‘ప్రతినిధి 2’ మూవీలో హీరోయిన్ గా నటించింది. ఆ సినిమా షూటింగ్ సమయంలోనే వీరిద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారి, ఇప్పుడు వివాహానికి దారితీసింది.
ALSO READ: https://teluguprabha.net/cinema-news/venkatesh-role-in-chiranjeevi-manasankar-varaprasad/
గత ఏడాది అక్టోబర్ 13న హైదరాబాద్‌లో ఇరు కుటుంబాల పెద్దల సమక్షంలో వీరి నిశ్చితార్థం ఘనంగా జరిగింది. నిశ్చితార్థం తర్వాత కొద్ది రోజులకే నారా రోహిత్ తండ్రి రామ్మూర్తి నాయుడు అకాల మరణం చెందడంతో, వీరి పెళ్లి వాయిదా పడింది. తాజాగా ఆయన ఏడాది సంస్కారాలు పూర్తవ్వడంతో, పెళ్లికి ముహూర్తం నిశ్చయించినట్లు తెలుస్తోంది.
ముందుగాహైదరాబాద్, తెల్లాపూర్‌లోని మండూవ కోర్ట్‌యార్డ్‌లో సంప్రదాయబద్ధంగా హల్దీ వేడుకతో పెళ్లి కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. ఆ తర్వాత, ఐటీసీ గ్రాండ్ కాకతీయలో పండుగలా పెళ్లి కొడుకు కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. తిరిగి మండూవ కోర్ట్‌యార్డ్‌లోనే మెహందీ వేడుకతో సాయంత్రం సందడి చేయనున్నారు.
ALSO READ: https://teluguprabha.net/cinema-news/k-ramp-producer-rajesh-danda-slams-reviewers-telugu360-bias/
ఇక, పెళ్లి వేడుక హైదరాబాద్‌లోని అజీజ్ నగర్‌లో జరగనుంది. ఈ వేడుకకు సినీ, రాజకీయ రంగాల నుంచి పెద్ద ఎత్తున ప్రముఖులు, హాజరై నూతన దంపతులను ఆశీర్వదించనున్నారు.


