ఆగస్ట్ 5న పిఠాపురంలో ప్రముఖ నిర్మాణ సంస్థ GA2 పిక్చర్స్, బన్నీవాస్, విద్యా కొప్పినీడి, నార్నే నితిన్, అంజి కె.మణిపుత్ర కాంబినేషన్‌లో రూపొందుతోన్న ఫన్ ఎంటర్‌టైనర్ ‘ఆయ్’ ట్రైలర్ విడుదల
కడుపుబ్బా నవ్వుకునే కామెడీ సినిమాలు రావటం అరుదుగా మారుతున్న తరుణంలో, కుటుంబమంతా కలిసి నవ్వుకునేలా, నవ్వుల పండుగను ‘ఆయ్’ చిత్రంతో ప్రేక్షకులకు అందించటానికి సిద్ధమైంది ప్రెస్టీజియస్ బ్యానర్ GA2 పిక్చర్స్. ఎనర్జిటిక్ హీరో నార్నే నితిన్, నయన్ సారిక జంటగా నటిస్తున్నారు. అంజి కె.మణిపుత్ర ఈ చిత్రంతో దర్శకుడిగా బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో టాలెంటెడ్ యంగ్ ప్రొడ్యూసర్స్ బన్నీ, విద్యా కొప్పినీడి ఈ ఫన్ ఎంటర్‌టైనర్‌ను నిర్మిస్తున్నారు.
ఫన్ ఎంటర్‌టైనర్ ‘ఆయ్’ సినిమాను స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్ట్ 15న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. డిఫరెంట్ ప్రమోషనల్ కంటెంట్‌తో ఈ సినిమా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ‘ఆయ్’ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పాటలు సూపర్బ్ రెస్పాన్స్‌ను రాబట్టుకున్నాయి. సోషల్ మీడియాలో రీల్స్, షార్ట్స్ రూపంలో తెగ వైరల్ అయ్యాయి. దీంతో సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ అంచనాలను మరింత పెంచేలా మేకర్స్ ఆగస్ట్ 5న పిఠాపురంలో ‘ఆయ్’ మూవీ ట్రైలర్‌ను విడుదల చేస్తున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. పోస్టర్‌ను గమనిస్తే హీరో నార్నే నితిన్, హీరోయిన్ నయన్ సారిక గోదావరిలో చెరో పడవలో సేద తీరుతూ ప్రకృతిని ఆస్వాదిస్తున్నారు. చిన్నపాటి నవ్వుల స్నానానికి ఆగస్ట్ 5న సిద్ధం కండి అంటూ క్యాప్షన్ ఇవ్వటం ద్వారా మేకర్స్ సినిమా ఎంత ఫన్నీగా ఆకట్టుకోనుందనే విషయాన్ని చెప్పారు.
ఫన్ ఎంటర్‌టైనర్ ‘ఆయ్’ నుంచి రెగ్యులర్‌గా మూవీ అప్‌డేట్స్‌ను ఇస్తున్నారు. గోదావరి బ్యాక్‌డ్రాప్‌తో ఆయ్ సినిమా రూపొందింది. ఈ ఫన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో నార్నే నితిన్ ప్రేక్షకులను ఆకట్టుకుంటారు. ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో రూపొందుతోన్న ఈ సినిమాకు కిరణ్ కుమార్ మన్నె ఆర్ట్ డైరెక్టర్‌గా, సమీర్ కళ్యాణి సినిమాటోగ్రాఫర్‌గా, రామ్ మిర్యాల సంగీత దర్శకుడిగా వర్క్ చేశారు.
GA2 పిక్చర్స్:
ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, డైనమిక్ యంగ్ ప్రొడ్యూసర్ బన్నీ వాస్ కలయికలో GA2 పిక్చర్స్ కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాలను అందిస్తూ వస్తున్నారు. భలే భలే మగాడివోయ్, గీతా గోవిందం, టాక్సీవాలా, ప్రతిరోజూ పండగే, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ వంటి హిట్ చిత్రాలు ఈ బ్యానర్‌లో రూపొందాయి.