Rashmika Mandanna: నేషనల్ క్రష్ రష్మిక మందన్న వరుస విజయాలతో దూసుకుపోతోంది. పుష్ప సీక్వెల్స్ (Pushpa) తర్వాత పాన్ ఇండియా వైడ్‌గా రష్మిక కి వచ్చిన క్రేజ్ అసాధారణం. ఆ క్రేజ్ వల్ల బాలీవుడ్‌లో క్రేజీ ఆఫర్స్ వచ్చాయి. చాలామంది సౌత్‌లో స్టార్ హీరోయిన్‌గా ఎదిగాక బాలీవుడ్ లో ఛాన్సుల కోసం ప్రయత్నాలు చేస్తారు. కానీ, అలాంటి ప్రయత్నాలేవీ చేయకుండానే హిందీ సీమలో కాలు పెట్టింది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో చేసిన అనిమల్ (Animal) అక్కడ రష్మికని స్టార్ హీరోయిన్‌గా చేసింది.
ఆనిమల్ తర్వాత చేసిన ఛావా మూవీతో మరో భారీ హిట్ అందుకున్నారు. ఈ క్రమంలోనే సల్మాన్ ఖాన్ సరసన సికందర్ చేశారు. కానీ, ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటలేకపోయింది. అయినా రష్మికను బాలీవుడ్ నెత్తిమీద పెట్టుకుంది. ఇక తాజాగా కుబేర (Kubera) మూవీతో మరో పాన్ ఇండియా హిట్ అందుకున్నారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగార్జున, ధనుష్ రష్మిక ప్రధాన పాత్రల్లో చేసిన కుబేరా పాన్ ఇండియా వైడ్‌గా డీసెంట్ కలెక్షన్స్ రాబడుతోంది. ఇప్పటికే, 100 కోట్ల క్లబ్‌లో చేరింది.
ALSO READ: https://teluguprabha.net/cinema-news/vishnu-manchu-pan-india-movie-kannappa-review/
ఇక ఈ క్రమంలో లేటెస్ట్ మూవీని ప్రకటించారు రష్మిక. ‘మైసా’ అనే టైటిల్‌తో రూపొందనున్న ఈ సినిమాలో వైల్డ్ అవతార్‌లో కనిపించనున్నారు. ఈ మూవీని తాజాగా ప్రకటించిన మేకర్స్ రష్మిక లుక్ ని రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ లుక్ నెట్టింట వైరల్ అవుతోంది. రవీంద్ర పుల్లే దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను అన్‌ఫార్ములా ఫిలిమ్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఇక తాజాగా ప్రకటించిన మైసా మూవీలోని రష్మిక ఫస్ట్ లుక్ ని తమిళ భాషలో ధనుష్, హిందీ లో విక్కీ కౌశల్, మలయాళంలో దుల్కర్ సల్మాన్, కన్నడలో శివరాజ్ కుమార్, తెలుగులో దర్శకుడు హను రాఘవపూడి రిలీజ్ చేయడం విశేషం.
ఇక ఈ మూవీ టైటిల్ అండ్ రష్మిక లుక్ చూస్తుంటే ‘గోండ్ తెగ’ మహిళ పాత్రలో రష్మిక మందన్న కనిపించబోతున్నట్టుగా తెలుస్తోంది. త్రిపులార్ మూవీలో తారక్ కూడా ఈ తెగకి చెందిన నాయకుడిగా కనిపించారు. కాబట్టి, రష్మిక పాత్రకి కూడా ఇదే రేంజ్‌లో క్రేజ్ వస్తుందని అభిమానులు చెప్పుకుంటున్నారు. ఇక ఈ బ్యూటీ నటిస్తున్న మరో క్రేజీ ప్రాజెక్ట్ ది గర్ల్ ఫ్రెండ్ కూడా ఈ ఏడాది ద్వితీయార్థంలో వచ్చేందుకు సిద్ధమవుతోంది. నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ ఈ మూవీ దర్శకత్వం వహిస్తున్నారు.