Wednesday, July 16, 2025
Homeచిత్ర ప్రభKeerthy Suresh - Uppu Kappurambu: కీర్తి సురేష్‌కి నేచురల్ స్టార్ సపోర్ట్

Keerthy Suresh – Uppu Kappurambu: కీర్తి సురేష్‌కి నేచురల్ స్టార్ సపోర్ట్

Naturalstar Nani: జనరల్‌గా హీరోయిన్స్ తాము ఒప్పుకున్న సినిమా వరకే ప్రమోషన్స్ చేయడానికి ఓకే చెప్తారు. నయనతార (Nayanthara) లాంటి అతి కొద్దిమంది మాత్రమే యాక్ట్ చేసేసి వెళ్ళిపోతారు తప్ప ప్రమోషన్స్ కి మాత్రం హాజరవరు. అయితే, ఈ మధ్యకాలంలో ఒక హీరో సినిమాకి మరో హీరోనో, హీరోయినో వచ్చి స్పెషల్‌గా ప్రమోట్ చేస్తున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా రావడం అనేది ఎప్పటి నుంచో ఉన్న ఫార్మాట్.

- Advertisement -

కానీ, సోషల్ మీడియా వచ్చాక సినిమా ప్రమోషన్స్ మరింత సులభం అయింది. ఇటీవల సమంత నిర్మాతగా చేసిన శుభం (Subham)కి స్టార్ హీరోయిన్ కీర్తిసురేశ్ అలాగే వెన్నెల కిషోర్ లాంటి టాప్ కమెడియన్ వినూత్నంగా ప్రమోట్ చేశారు. ఇదంతా వారి మధ్య ఉండే స్పెషల్ బాండింగ్ వల్లే కుదురుతుంది. ఈ కారణంగానే కొంత‌మంది హీరోహీరోయిన్లు మ‌ధ్య బాండింగ్ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. కలిసి ఒక సినిమా చేసిన తర్వాత కూడా రెగ్యులర్‌గా కలుసుకోవడం పార్టీలు చేసుకోవడం జరుగుతుంటాయి.

ALSO READ: https://teluguprabha.net/cinema-news/vishnu-manchu-pan-india-movie-kannappa-review/

నాని తన సినిమాలలో నటించిన హీరోయిన్స్‌తో మంచి రాపో మేయిన్‌టైన్ చేస్తుంటాడు. ఆ లిస్ట్ లో కీర్తి సురేశ్ కూడా ఉన్నారు. ఇది వరకే నాని, కీర్తి కలయికలో, నేను లోకల్, దసరా వంటి సూపర్ హిట్ మూవీస్ ప్రేక్షకులను మెప్పించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మూడవసారి కలిసి ఓ సినిమా చేస్తారని ప్రచారం జరుగుతుంది. ఈ విషయం పక్కనపెడితే కీర్తి సురేష్ న‌టించిన తాజా చిత్రం ఉప్పు క‌ప్పురంబు. ఇది జులై 4న అమెజాన్ ప్రైమ్ వీడియోలో నేరుగా రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ట్రైలర్ ప్రేక్షకులను బాగా మెప్పిస్తోంది.

ఈ నేప‌థ్యంలో నేచుర‌ల్ స్టార్ నాని ఉప్పు క‌ప్పురంబు (Uppu Kappurambu) ట్రైల‌ర్ ను చూసి ఆసక్తికరంగా ఓ పోస్ట్ చేశారు. “ఉప్పు క‌ప్పురంబు ట్రైల‌ర్ చాలా స‌ర‌దాగా, విచిత్రంగా ఉంది.. ట్రైల‌ర్ లో మా కీర్తి చాలా అమాయ‌కంగా, ఛార్మింగ్ గా కనిపించింది.. సుహాస్ తో పాటు మిగిలిన వాళ్లు సినిమాపై ఆస‌క్తిని క్రియేట్ చేస్తున్నారు. ఈ సినిమా కోసం నేను ఎదురుచూస్తున్నాను..ఈ మూవీ డైరెక్ట‌ర్ కి అలాగే, చిత్ర యూనిట్ మొత్తానికి బెస్ట్ విషెస్.. అని ఆ పోస్ట్ లో నాని రాశారు. నాని పోస్ట్ కు కీర్తి స్పందిస్తూ, థాంక్యూ నాని.. ఈ సినిమాను మీరు ఎప్పుడెప్పుడు చూస్తారా..? అని నేను కూడా వెయిట్ చేస్తున్నా” అంటూ రిప్లై ఇచ్చారు. ఇలా కీర్తి నటించిన ఉప్పు క‌ప్పురంబు సినిమాపై నాని పోస్ట్ పెట్టడం దానికి కీర్తి రిప్లై ఇవ్వడం ఆడియన్స్‌లో ఇంకా ఆసక్తిని పెచింది. చూడాలి మరి ఈ మూవీతో కీర్తి హిట్ అందుకుంటుందా లేదా అని.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News