Naveen Polishetty: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోలలో నవీన్ పోలిశెట్టి కూడా ఒకరు. కొందరు హీరోలు పక్కా కమర్షియల్ సినిమాలనే చేయాలనుకుంటారు. కానీ, అడవి శేష్, నవీన్ పోలిశెట్టి లాంటి అతికొద్ది హీరోలు మాత్రం డిఫరెంట్ జోనర్ సినిమాలతో మెప్పించాలని, ఇండస్ట్రీలో తమకంటూ ఓ ప్రత్యేక స్థానం ఉండాలని ఆరాటపడుతుంటారు. ఈ క్రమంలో వారు అనుకున్న విజయాలను అందుకున్నారు.
ప్రస్తుతం నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజు అనే సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో హీరోయిన్‌గా మీనాక్షి చౌదరి నటిస్తోంది. 2026 సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. అయితే, తాజా సమాచారం మేరకు ఈ సినిమాలో నవీన్ పోలిశెట్టి ఓ పాట పాడబోతున్నట్టుగా సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దగ్గర్నుంచీ బాలయ్య, వెంకటేశ్ సహా చాలామంది హీరోలు పాటలు పాడి సక్సెస్ అయ్యారు.
Also Read- Allu Arjun: అల్లు అర్జున్, అట్లీ సినిమా సంగీత దర్శకుడతనేనా..? బన్నీ లీక్‌లో ఏముంది?
ఇప్పటికే సింగర్‌గా నవీన్ పోలిశెట్టి..
ఇప్పటికే స్టేజ్ మీద నవీన్ పోలిశెట్టి పాటలు పాడి ప్రేక్షకులను అలరించాడు. ఆ పాటలు విని, చూసి అరే.. నవీన్‌లో మంచి సింగర్ కూడా ఉన్నాడే అనుకున్నవారూ లేకపోలేదు. బాలీవుడ్ సింగర్ ఉదిత్ నారాయణ్‌ని అచ్చుగుద్దినట్టుగా ఇమిటేట్ చేసిన సందర్భాలూ ఉన్నాయి. అయితే, మొదటిసారి అనగనగా ఒక రాజు సినిమాలో నవీన్ తన గాత్రాన్ని వినిపించబోతున్నాడట. త్వరలో దీనికి సంబంధించిన అఫీషియల్ కన్‌ఫర్మేషన్ కూడా రానున్నట్టు తెలుస్తోంది.
‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ తో నటుడిగా..
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’, మహేశ్ బాబు హీరోగా నటించిన ‘1 నేనొక్కడినే’ సినిమాలలో నటించిన నవీన్ ఆ తర్వాత బాలీవుడ్‌లో పలు సిరీస్‌లు చేసి గుర్తింపు తెచ్చుకున్నాడు. దాంతో తెలుగులో ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ మూవీలో ఛాన్స్ దక్కించుకొని ఇక్కడ పాపులర్ అయ్యాడు. ‘జాతి రత్నాలు’ మూవీతో నవీన్ కెపాసిటీ అందరికీ తెలిసింది. ఇక, నవీన్ నటించిన గత చిత్రం ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ డిజప్పాయింట్ చేసిన సంగతి తెలిసిందే.
Also Read- Madhavi: ‘చిరంజీవి’ అలనాటి హీరోయిన్.. ఇప్పుడెలా ఉందో చూశారా.?


