Naveen Polishetty: అనగనగా ఒక రాజుతో సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకొచ్చారు నవీన్ పొలిశెట్టి. చిరంజీవి, ప్రభాస్, రవితేజ వంటి స్టార్ హీరోల సినిమాల పోటీని తట్టుకొని ఈ సినిమా హిట్టు టాక్‌ను తెచ్చుకుంది . ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ మూవీలో తన కామెడీ టైమింగ్, పంచ్‌లతో ఆడియెన్స్ మెప్పించాడు నవీన్ పొలిశెట్టి. అనగనగా ఒక రాజుతో హీరోగా హ్యాట్రిక్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సంక్రాంతి బ్లాక్‌బస్టర్ తర్వాత నవీన్ పొలిశెట్టి నెక్స్ట్ మూవీ ఏదన్నది అభిమానుల్లో ఆసక్తికరంగా మారింది. అనగనగా ఒక రాజుకు ముందు సినిమాలకు రెండేళ్ల పాటు గ్యాప్ తీసుకున్నాడు నవీన్ పొలిశెట్టి. ఈ సారి మాత్రం ఇమ్మిడియేట్‌తో నెక్స్ట్ మూవీని సెట్స్‌పైకి తీసుకొచ్చే ప్లానింగ్‌లో ఉన్నాడట.
ఇప్పటికే కొందరు దర్శకులతో పాటు టాప్ ప్రొడ్యూసర్లు నవీన్‌ను అప్రోచ్ అయ్యారట. వారికి అతడు కొన్ని కండీషన్లు పెడుతోన్నట్లు ప్రచారం జరుగుతోంది.
అనగనగా ఒక రాజు హిట్‌తో తన రెమ్యూనరేషన్ నవీన్ పొలిశెట్టి పెంచినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సంక్రాంతి బ్లాక్‌బస్టర్ మూవీ కోసం అతడు పది కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకున్నట్లు సమాచారం. నెక్స్ట్ సినిమా కోసం మరో ఐదు కోట్లు పెంచాడట. పదిహేను కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. నవీన్‌కు ఉన్న మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకొని నిర్మాతలు కూడా అందుకు అంగీకరించినట్లు సమాచారం.
Also Read – Ashika Ranganath: మళ్ళీ సంక్రాంతికి రెడీ అవుతున్న గ్లామర్ బ్యూటీ!
యాక్టర్‌గానే కాకుండా నవీన్ పొలిశెట్టిలో మంచి రైటర్ కూడా ఉన్నాడు. అనగనగా ఒక రాజు కథ, డైలాగ్స్ విషయంలో డైరెక్టర్ కంటే నవీన్ పొలిశెట్టి ఇన్‌వాల్వ్‌మెంట్ ఎక్కువగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. రాబోవు సినిమాల విషయంలో ఈ క్రియేటివ్ ఫ్రీడమ్ ఇవ్వాలని కూడా నవీన్ దర్శక నిర్మాతలకు కండీషన్ పెడుతున్నట్లు సమాచారం. ఈ రెండు కండీషన్స్‌కు ఒప్పుకుంటేనే తాను సినిమా చేస్తానని అంటున్నాడని టాలీవుడ్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
కాగా అనగనగా ఒక రాజు మూవీ వంద కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. అన్ని ఏరియాలలో బ్రేక్ ఈవెన్‌ను సాధించినట్లు నిర్మాత నాగవంశీ ప్రకటించారు. లాంగ్ గ్యాప్ తర్వాత అనగనగా ఒక రాజుతో నాగవంశీకి హిట్టు దక్కింది.
Also Read – Sharwanand: తండ్రీకొడుకులుగా శర్వానంద్.. ఫ్యాన్స్ ఒప్పుకుంటారా?

