Thursday, September 19, 2024
Homeచిత్ర ప్రభNayanthara : స్టార్ హీరోయిన్ సినిమా.. ఇంటర్వెల్ లేకుండానే రిలీజ్..

Nayanthara : స్టార్ హీరోయిన్ సినిమా.. ఇంటర్వెల్ లేకుండానే రిలీజ్..

- Advertisement -

Nayanthara : సాధారణంగా సినిమా నిడివి దాదాపు 2 లేదా 2 గంటల 30 నిమిషాల వరకు ఉంటాయి. అప్పుడప్పుడు 2 గంటల కంటే తక్కువ నిడివి ఉన్న సినిమాలు కూడా వస్తాయి. అలాంటి సినిమాలకి కూడా ఇంటర్వెల్ ఇస్తారు. కానీ లేడీ సూపర్ స్టార్ నయనతార తాజాగా ఇంటర్వెల్ లేకుండానే గంట 30 నిమిషాలు ఉండే సినిమాని రిలీజ్ చేయబోతుంది.

నయనతార త్వరలో కనెక్ట్ అనే ఓ హారర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతుంది. ఈ సినిమా గురించి నయనతార భర్త, డైరెక్టర్ విగ్నేష్ శివన్ తన ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ.. కనెక్ట్ సినిమా కేవలం 99 నిమిషాల నిడివి మాత్రమే ఉంది. ఇంటర్వెల్ లేకుండానే ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ఒక మంచి హారర్ సినిమాని మీకు అందిస్తున్నాము. డిసెంబర్ 22న ఈ సినిమా థియేటర్స్ లోకి రానుంది అని పోస్ట్ చేశాడు.

నయనతార మెయిన్ లీడ్ లో అశ్విన్ శరవణ దర్శకత్వంలో విగ్నేష్ శివన్ నిర్మాతగా కనెక్ట్
సినిమా తెరకెక్కుతుంది. హారర్ నేపథ్యంలో చిత్రీకరిస్తున్న ఈ సినిమా టీజర్ ని ఇటీవలే రిలీజ్ చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News