Sunday, November 16, 2025
Homeచిత్ర ప్రభNayanthara: 50 సెకన్లకు రూ. 5 కోట్లు.. లేడీ సూపర్ స్టార్ నయనతార అదిరిపోయే పారితోషికం!

Nayanthara: 50 సెకన్లకు రూ. 5 కోట్లు.. లేడీ సూపర్ స్టార్ నయనతార అదిరిపోయే పారితోషికం!

Nayanthara Remunaration: దక్షిణాది లేడీ సూపర్ స్టార్ నయనతార పారితోషికం విషయంలో మరోసారి వార్తల్లో నిలిచింది. సినిమాల ప‌రంగా ద‌క్షిణాదిలో టాప్ హీరోయిన్‌గా ఇప్ప‌టికీ న‌య‌న్ కొన‌సాగుతోంది. సినిమాకు ఆమెకు ప‌ది కోట్ల‌కు పైగానే రెమ్యున‌రేష‌న్‌ను ముట్ట చెబుతున్నారు. ఇవి కాకుండా యాడ్స్ రూపంలోనూ ఆమె భారీ పారితోష‌కాన్నే అందుకుంటోంది. తాజాగా ఆమె న‌టించిన ఓ యాడ్ కోసం తీసుకున్న రెమ్యున‌రేష‌న్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీగా మారింది. ఎందుకంటే కొన్ని సెకన్ల నిడివి ఉన్న ఈ యాడ్ కోసం న‌య‌న‌తార హ్యూజ్ రేంజ్‌లో రెమ్యున‌రేష‌న్ తీసుకుందద‌ని స‌మాచారం. ఆ యాడ్ ఎదో కాదు.. టాటా స్కై.

- Advertisement -

సినీ స‌ర్కిల్స్ టాక్ మేర‌కు.. కేవలం 50 సెకన్ల నిడివి గల టాటా స్కై వాణిజ్య ప్రకటనకు ఆమె ఏకంగా రూ. 5 కోట్లు తీసుకుంది. ఇదిప్పుడు ఇండ‌స్ట్రీలో డిస్క‌ష‌న్ పాయింట్‌గా మారింది. ఎందుకంటే చాలా మంది స్టార్ హీరోలు కూడా ఒక ప్రకటనకు ఇంత పారితోషికం తీసుకోరు. అంటే ఆమె ఒక సెకనుకు అక్షరాలా రూ. 10 లక్షలు తీసుకున్నారు. ఈ యాడ్ షూట్ రెండు రోజుల పాటు జరిగిన‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. నయనతార సాధారణంగా వాణిజ్య ప్రకటనలలో నటించడం చాలా అరుదు, బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించినప్పుడు మాత్రమే ప్రకటనలు చేస్తారు. ‘లేడీ సూపర్‌స్టార్’ (Lady Superstar) అనే బిరుదుకు తగ్గట్టే ఆమె దూసుకుపోతుందని ఈ ఇన్సిడెంట్‌తో మరోసారి ప్రూవ్ అయ్యింది.

Also Read – 90 ఏళ్ల వృద్ధుడికి ఒక్కరోజు జైలు శిక్ష .. ఎందుకంటే..?

ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే ఇటీవల కోలీవుడ్‌లో నయనతార నటించిన చిత్రాలు ఆశించిన విజయాలను సాధించనప్పటికీ, హిందీలో షారుఖ్‌ ఖాన్‌కు జంటగా నటించిన ‘జవాన్’ చిత్రం సూపర్ హిట్‌గా నిలిచింది. ప్రస్తుతం ఆమె తెలుగులో చిరంజీవికి (Chiranjeevi) జంటగా అనీల్ రావిపూడి (Anil Ravipudi) ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న సినిమాలో యాక్ట్ చేస్తున్నారు. ఈ మూవీ రానున్న ఏడాది సంక్రాంతికి రిలీజ్ కానుంది. అలాగే యష్ హీరోగా రూపొందుతోన్న టాక్సిక్ చిత్రంలోనూ నయన్ కీలక పాత్రలో కనిపించనుంది.

వివాదాలు కూడా ఈ ముద్దుగుమ్మ‌కు కొత్తేం కాదు అన్న‌ట్లు త‌యారైంది. నిత్యం కాంట్ర‌వ‌ర్సీ పాయింట్స్‌తో ఈమె వార్త‌ల్లో నిలుస్తోంది. తాజాగా ఆమె పెళ్లి డాక్యుమెంట‌రీ బియాండ్ ది ఫెయిరీ టేల్‌ చిత్రీక‌ర‌ణ‌లో ఉప‌యోగించిన చంద్ర‌ముఖి (Chandramukhi) సినిమా సన్నివేశాల‌కు రూ.5 కోట్లు చెల్లించాల‌ని నిర్మాత‌లు కోరారు. ఇప్ప‌టికే ధ‌నుష్ సినిమా నానుం రౌడీ దాన్ సినిమా ఇదే వ్య‌వ‌హారంపై రూ.10 కోట్లు డిమాండ్ చేశాడు. ఇప్పుడు చంద్ర‌ముఖి నిర్మాత‌లు కూడా ఇలాగే రియాక్ట్ కావ‌టంపై న‌య‌న‌తార ఎలా స్పందిస్తుందో చూడాలి మ‌రి.

Also Read – Mouni Roy: నాగినీ నాజూకు అందాలు చూస్తే మీరు తట్టుకోలేరు.. షాకిస్తున్న మౌనీ రాయ్ లేటెస్ట్ పిక్స్..

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad