NBK112: రూమర్సే నిజం అయ్యాయి. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ ని ప్లాన్ చేస్తున్నారంటూ కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతుంది. బాలకృష్ణతో 112వ చిత్రానికి కొరటాల దర్శకత్వం వహించబోతున్నాడంటూ గుసగుసలు వినిపించాయి. దేవర 2 కంటే ముందు కొరటాల బాలయ్యతో మూవీ చేయబోతున్నాడంటూ జోరుగా ప్రచారం జరిగింది.
ఇది తెలిసి నందమూరి ఫ్యాన్స్ అంత ఫుల్ ఖుష్ అయ్యారు. కానీ, దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన లేదు. దీంతో వీరిద్దరి కాంబో నిజమా? కాదా? అనే సందేహాలు నెలకొన్నాయి. దీంతో అంత ఇది రూమర్ అని అనుకున్నారు. కానీ, ఇప్పుడు ఈ పుకార్లను నిజం చేస్తూ ఈ కాంబోపై అధికారిక ప్రకటన వచ్చింది. తాజాగా వీరిద్దరి కాంబో సెట్ అయ్యిందని వెల్లడిస్తూ మూవీపై అధికారిక ప్రకటన ఇచ్చారు. ఈ వీరిద్దరి కాంబినేషన్ ని ఫిక్స్ చేస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు. త్వరలోనే షూటింగ్ కూడా మొదలు కానుంది వెల్లడించారు.

కాగా ఇది పొలిటికల్ కాన్సెప్ట్ మూవీ అని కొందరు అంటుంటే పక్కా యాక్షన్ కమర్షియల్ సినిమా అని మరికొందరు అంటున్నారు. బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. దీనితో సమాంతరంగా కొరటాల మూవీ కూడా చేయబోతున్నారని తెలుస్తోంది. మరి బాలకృష్ణతో మూవీ చేసిన తర్వాతైనా కొరటాల ‘దేవర 2’ చేస్తారా లేదంటే దాన్ని అలా వదిలేస్తారా అనేది చూడాలి.

