Coolie – Rajinikanth: సినిమాకి ప్రమోషన్ అనేది చాలా ముఖ్యం. కొన్ని సినిమాలు ప్రమోషన్ చేయపోతేనే సైలెంట్ గా వచ్చి రికార్డులు బద్దలు కొడతాయి. కానీ, కొన్ని సినిమాలకి మాత్రం సౌండ్.. రీ సౌండ్ తప్పనిసరి. దాన్ని బట్టే జనాలలో, అభిమానుల్లో ఓ అంచనా ఏర్పడుతుంది. ముఖ్యంగా సౌత్‌లో.. మరీ ముఖ్యంగా తెలుగు ఇండస్ట్రీ కంప్లీట్‌గా ఫ్యాన్ బేస్ ఉన్నది. ఏ హీరోకి తగ్గట్టు ఆ హీరోకి విపరీతమైన అభిమానులున్నారు. వారే సినిమాకి కావాల్సినంత పబ్లిసిటీ తీసుకొస్తారు. కానీ, దీనికి మేకర్స్ కూడా ఊపు తెచ్చే అప్‌డేట్స్ ఇవ్వాలి. కానీ, ఎన్టీఆర్ బాలీవుడ్ లో ఎంటీ ఇచ్చి చేసిన మొదటి సినిమా వార్ 2 కి మాత్రం అది కనిపించడం లేదు. మరికొన్ని రోజుల్లో వార్ 2 విడుదలకు సిద్ధమవుతోంది. అయితే, ఇప్పటివరకు టీజర్ తప్ప యష్ రాజ్ ఫిలింస్ నుంచి ఎలాంటి అప్‌డేట్స్ రాలేదు.
వార్ 2 నుంచి వచ్చిన ఒకే ఒక్క టీజర్ కి కూడా నెగిటివిటీనే ఎక్కువగా ఉంది. ఒకరకంగా ఇది టీమ్ ని ఖంగారు పెట్టింది. అందుకే, ఇకపై ఇచ్చే అప్‌డేట్స్‌లో ఎలాంటి విమర్శలకి అవకాశం ఇవ్వకుండా వార్ 2 మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టుగా ముంబై మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇంకా, జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబోలో వచ్చే సాంగ్ ని షూట్ చేయాల్సి ఉంది. దీనికోసం భారీగానే ఏర్పాట్లు జరిగాయి. జూలై మొదటి రెండు వారాల్లో ఈ సాంగ్‌ను కంప్లీట్ చేయనున్నారట. ఈలోపు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలన్నీ ఒక కొలిక్కి వచ్చేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు తాజా సమాచారం.
ALSO READ: https://teluguprabha.net/cinema-news/anushka-shetty-in-talks-for-khaithi-2/
అయితే, ఆగస్ట్ 14న కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన కూలితో బరిలో దిగేందుకు వార్ 2కి ఇప్పుడున్న బలం సరిపోదని చెప్పుకుంటున్నారు. కూలి థియేటర్ హక్కుల కోసం అగ్ర నిర్మాణ సంస్థలు ఏ రేంజ్‌లో పోటీ పడి దక్కించుకున్నాయో అందరికీ తెలిసిందే. ఎగ్జిబిటర్లు కూడా ఈ సినిమాపై విపరీతమైన ఆసక్తి చూపిస్తున్నారు. ఇక వార్ 2కి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బజ్ కేవలం ఎన్టీఆర్ మాత్రమే. వార్ 2 ని ఆయన ఫ్యాన్స్ కి, మాస్ ఆడియన్స్ కి చేరేలా ప్రమోషన్స్ నిర్వహించాలి. అదే జరగడం లేదని తారక్ అభిమానులు టెన్షన్ పడుతున్నారు. ఏ సినిమాకైనా కంటెంట్ ఎంత బలంగా ఉంటే అంత ఓపెనింగ్స్ వస్తాయి. కానీ, వార్ 2లో ఉన్న కంటెంట్ మీద ఎవరికీ క్లారిటీ రావడం లేదు.
ఇప్పటినుంచైనా వార్ 2 కి ప్రమోషన్స్ పరంగా చేసే స్ట్రాటజీ తెలుగు వెర్షన్ వరకు ఖచ్చితంగా ఎన్టీఆర్ ని ఫోకస్ చేసే జరగాలి. అప్పుడే ఫ్యాన్స్ తో పాటు మిగతా ఆడియన్స్ కూడా త్వరగా కనెక్ట్ అవుతారు. వార్ 2 కి అతిపెత్త మైనస్ దర్శకుడు. ఆర్ఆర్ఆర్ లా ఈ సినిమాకి దర్శకుడి బ్రాండ్ అనేదే లేదు. అయాన్ ముఖర్జీ మన సౌత్ ఆడియన్స్ కి తెలిసింది చాలా తక్కువ. బ్రహ్మాస్త్ర తీసినప్పటికీ అది మన సౌత్ ఆడియన్స్ కి అసలు గుర్తుండి ఉండదు. కానీ, కూలి సినిమాకి రజనీకాంత్ తో పాటు నాగార్జున, ఉపేంద్ర, అమీర్ ఖాన్, అనిరుధ్ రవిచందర్ ఇలా అందరూ సౌత్ తో పాటు నార్త్ లోనూ బాగా సుపరిచితులు. వార్ 2 విషయంలో మాత్రం ఈ భారమంతా తారక్, హృతిక్ ల మీదే ఉంది. దీన్ని బట్టి వార్ 2 జనాలలోకి వెళ్ళాలంటే మేకర్స్ ఎన్ని రకాల ఎత్తుగడలు వేయాలో ఒకసారి ఆలోచించుకోవాల్సి ఉంది.