Sandakari Movie: ఇటీవల తమిళనాడు ప్రభుత్వం ప్రకటించిన స్టేట్ ఫిల్మ్ అవార్డుల్లో రిలీజ్ కానీ సినిమాకు మూడు అవార్డులు దక్కడం హాట్ టాపిక్‌గా మారింది. ఆ సినిమా థియటర్లలోనే కాదు ఓటీటీలో కూడా అందుబాటులో లేదు. అయినా అవార్డులు ఎలా ప్రకటించారంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. హీరోయిన్‌గా బిజీగా ఉన్న టైమ్‌లో శ్రియా… సందక్కారి పేరుతో తమిళంలో ఓ రొమాంటిక్ కామెడీ మూవీ చేసింది. 2020లో షూటింగ్ మొదలైన ఈ మూవీ అదే ఏడాది రిలీజ్ కావాల్సింది. కానీ ఆర్థిక సమస్యల వల్ల ఇప్పటికీ విడుదలకు నోచుకోలేదు.
ఇటీవల తమిళనాడు ప్రభుత్వ 2016 – నుంచి 2022 వరకు ఏడేళ్ల స్టేట్ ఫిల్మ్ అవార్డులను ప్రకటించింది. ఈ అవార్డుల్లో 2020 ఏడాదికి గాను సందక్కారి సినిమాకు ఏకంగా మూడు అవార్డులు దక్కాయి. బెస్ట్ ఫిల్మ్‌తో పాటు బెస్ట్ మేల్ సింగర్, బెస్ట్ ఆర్ట్ డైరెక్షన్ విభాగాల్లో ఈ సినిమాకు అవార్డులను ప్రభుత్వం ప్రకటించింది.
Also Read – 2027 Sankranthi: 2027 సంక్రాంతి బెర్తులు కన్ఫామ్ – బాక్సాఫీస్ బరిలో సీనియర్ స్టార్స్
అసలు థియేటర్లలో రిలీజ్ కానీ సినిమాకు అవార్డులు ఎలా ఇస్తారంటూ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం ఓటీటీలో కూడా అందుబాటులో లేదని.. అలాంటప్పుడు ఏ ప్రాతిపాదికన ఈ మూవీకి అవార్డులు ఇచ్చారో చెప్పాలంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇది తమిళ స్ట్రెయిట్ మూవీ కూడా కాదని, ఓ రీమేక్ మూవీని బెస్ట్ ఫిల్మ్‌గా ఎంపిక చేయడం విడ్డూరంగా ఉందని అంటున్నారు. నెటిజన్ల ట్వీట్స్ వైరల్ అవుతున్నాయి.
మలయాళ మూవీ మై బాస్‌కు రీమేక్‌గా సందక్కారి రూపొందింది. మలయాళ ఒరిజినల్ వెర్షన్‌ను ఓ హాలీవుడ్ మూవీ నుంచి స్ఫూర్తి పొంది తెరకెక్కించారు. సందక్కారి మూవీలో విమల్, శ్రియా హీరో హీరోయిన్లుగా నటించారు. ప్రభు ఓ కీలక పాత్రలో కనిపించిన ఈ మూవీకి ఆర్ మాదేశ్ దర్శకత్వం వహించాడు. ఈ తమిళ మూవీని మేడమ్ పేరుతో తెలుగులోకి డబ్ చేయబోతున్నట్లు అప్పట్లో మేకర్స్ ప్రకటించారు. ఓ వీసా సమస్యల కారణంగా తన కింద పనిచేసే ఉద్యోగినే ఓ లేడీ బాస్ పెళ్లి చేసుకోవాల్సివస్తుంది. ఆ తర్వాత ఏమైంది? తనపై అనుక్షణం అధికారాన్ని ప్రదర్శించే ఆ బాస్ వల్ల ఆ ఉద్యోగి ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు అనే పాయింట్‌తో ఈ మూవీ రూపొందింది.
Also Read – Prabhas Cousin: మెగా హీరో సినిమాకు డైరెక్టర్‌గా ప్రభాస్ తమ్ముడు

