Monday, January 20, 2025
Homeచిత్ర ప్రభKannappa: ‘కన్నప్ప’ నుంచి కొత్త పోస్టర్‌ రిలీజ్‌.. పరమశివుడిగా అక్షయ్‌కుమార్‌

Kannappa: ‘కన్నప్ప’ నుంచి కొత్త పోస్టర్‌ రిలీజ్‌.. పరమశివుడిగా అక్షయ్‌కుమార్‌

డైనమిక్ హీరో విష్ణు మంచు(Manchu Vishnu) డ్రీమ్ ప్రాజెక్ట్‌గా ‘కన్నప్ప’(Kannappa) చిత్రం భారీ ఎత్తున రూపొందుతోంది. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మంచు మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘మహాభారత’ సిరీస్‌ని తెరకెక్కించిన ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఏప్రిల్ 25, 2025న ఈ సినిమా గ్రాండ్ గా విడుదల కానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్లు, టీజర్ అందరినీ ఆకట్టుకున్నాయి.

- Advertisement -

ఎంతో కీలకమైన పరమశివుడి పాత్రలో బాలీవుడ్‌ స్టార్ హీరో అక్షయ్‌ కుమార్ (Akshay Kumar) నటిస్తున్నారు. తాజాగా అక్షయ్ లుక్‌కు సంబంధించిన కొత్త పోస్టర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఈ సందర్భంగా మహాదేవ్‌ పాత్రలో యాక్ట్‌ చేయడంపై అక్షయ్‌ ఆనందం వ్యక్తంచేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News