Sunday, July 13, 2025
Homeచిత్ర ప్రభKannappa bookings: భారీగా అడ్వాన్స్ బుకింగ్స్.. కన్నప కథ మాములుగా లేదుగా..!

Kannappa bookings: భారీగా అడ్వాన్స్ బుకింగ్స్.. కన్నప కథ మాములుగా లేదుగా..!

- Advertisement -

Kannappa movie: మంచు విష్ణు ‘కన్నప్ప’ మూవీ అంచనాలను దాటుకుంటూ భారీ అడ్వాన్స్ బుకింగ్‌లతో దూసుకుపోతోంది. విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ మరికొద్ది గంటల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రంపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనికి తోడు, అడ్వాన్స్ బుకింగ్స్ ఊపందుకోవడంతో చిత్ర బృందం ఆనందం వ్యక్తం చేస్తోంది. మంచు విష్ణు స్వయంగా అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు.

గడిచిన 24 గంటల్లో:

కన్నప్ప సినిమాకు సంబంధించి కేవలం 24 గంటల్లోనే 1,15,000 టికెట్లు అమ్ముడైనట్లు ఆయన ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. ఈ అనూహ్య స్పందనతో ‘కన్నప్ప’ తొలి రోజు భారీ ఓపెనింగ్స్ సాధించడం ఖాయమని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ప్రీ-రిలీజ్ దశలోనే ప్రేక్షకుల నుంచి వస్తున్న ఈ అపూర్వమైన ప్రేమ తనకెంతో ఆనందాన్ని ఇచ్చిందని విష్ణు పేర్కొన్నారు. ‘కన్నప్ప’కు ఇలాంటి మద్దతు ఇచ్చిన ప్రతి సినీ ప్రియుడికి ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సినిమాపై ప్రేక్షకులకు ఉన్న నమ్మకం తన బాధ్యతను మరింత పెంచిందని ఆయన భావిస్తున్నారు.

భారీ పాన్-ఇండియా తారాగణం:

‘కన్నప్ప’లో మోహన్ బాబు, మోహన్ లాల్, శరత్ కుమార్, ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ వంటి దిగ్గజ తారలు కీలక పాత్రల్లో నటించారు. కాబట్టి ఇది సినిమాపై అంచనాలను మరింత పెంచింది. ఈ చిత్రాన్ని పాన్-ఇండియా స్థాయిలో, పలు భారతీయ భాషల్లో భారీ ఎత్తున విడుదల చేస్తున్నారు. ఇప్పటికే అమెరికాలో ప్రీమియర్ షోలు ప్రారంభం కాగా, భారతదేశంలో ఈరోజు సాయంత్రం 6 గంటల నుంచి ప్రీమియర్స్ మొదలవుతాయి.

శివ భక్తుడి కథ:

‘కన్నప్ప’ చిత్రం ప్రముఖ శివ భక్తుడు కన్నప్ప జీవిత కథ ఆధారంగా రూపొందించబడింది. ఈ ప్రాజెక్ట్‌పై మంచు విష్ణుతో పాటు చిత్ర బృందానికి ఎంతో నమ్మకం ఉంది. హిందీ వెర్షన్ ఫైనల్ కాపీని చూసిన పలువురు ప్రముఖ సినీ ప్రముఖులు సినిమా అద్భుతంగా ఉందని ప్రశంసించారు. మంచు విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్ట్‌గా భావించిన ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో, అంతర్జాతీయ స్థాయి సాంకేతిక నైపుణ్యంతో రూపొందించారు. VFX మరియు భారీ లొకేషన్లు ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.

బాలీవుడ్ దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సినిమా విజువల్స్ ప్రేక్షకులను అద్భుత లోకంలోకి తీసుకెళ్తాయని, భావోద్వేగమైన కథనం ఆకట్టుకుంటుందని చిత్ర యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News