Homeచిత్ర ప్రభNiharika Konidela: నేను చేయాలనుకుంది చేస్తూనే ఉంటా.. ట్రోల్స్, విమర్శలపై నిహారిక రియాక్షన్‌

Niharika Konidela: నేను చేయాలనుకుంది చేస్తూనే ఉంటా.. ట్రోల్స్, విమర్శలపై నిహారిక రియాక్షన్‌

Niharika Konidela: మెగా డాటర్‌ నిహారిక కొణిదెల ప్రస్తుతం నిర్మాతగా ఫుల్‌ బిజీ అయిపోయింది. ప్రస్తుతం నటిగా కంటే నిర్మాతగానే తన కెరీర్‌పై ఫుల్‌ ఫోకస్‌గా ఉంది. బ్యాక్‌ టూ బ్యాక్‌ చిత్రాలు నిర్మిస్తూ హిట్స్‌ అందుకుంటుంది. తన సొంత బ్యానర్‌ పింక్‌ ఎలిఫెంట పిక్చర్స్‌లో తొలి చిత్రంగా కమిటీ కుర్రాళ్లు నిర్మించిన సంగతి తెలిసిందే. అందరు కొత్త నటీనటులతో విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ఈ సినిమా ఊహించని విజయ్‌ సాధించింది. ప్రస్తుతం రాకాస మూవీని నిర్మించింది.

- Advertisement -

రాకాసతో ప్రీ రిలీజ్ ఈవెంట్
భారీ వీఎఫ్‌ఎక్స్‌ విజువల్స్‌తో హారర్‌ థ్రిల్లర్‌గా వస్తున్న ఈ సినిమా ఏప్రిల్‌ ౩న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇందులో భాగంగా నిన్న ఈ మూవీ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నిహారిక నిర్మాతగా తను ఎదుర్కొన్న సవాళ్లు, ట్రోల్స్‌పై స్పందించింది. ఈవెంట్‌లో నిహారిక మాట్లాడుతూ.. “మొదట్లో నిర్మాతగా నా ప్రతి నిర్ణయాన్ని ప్రశ్నించేవాళ్లు. సినిమా తీస్తున్నామనగానే చాలామంది సలమాలు ఇచ్చారు. నా సామర్థ్యాన్ని ఎగతాళి చేశారు. నా వల్ల కాదన్నారు. కమిటీ కుర్రాళ్లు.. చేస్తున్నప్పుడు అందరు కొత్తవాళ్లే నీకు ఈ తలనొప్పి అవసరమా? అన్నారు.

ఇదంత అవసరమా?
ఇప్పుడ రాకాస మూవీ విషయంలోనూ చాలామంది సలహా ఇచ్చారు. వీఎఫ్‌ఎక్స్ విషయంలో పెద్ద పెద్ద సినిమాలే కష్టపడాల్సి వస్తోంది.. మీది చిన్న బడ్జెట్ సినిమా.. చాలా ఇబ్బంది పెడతారు చూసుకోండి” అని చెప్పారని గుర్తు చేసుకుంది. ఏం చేసినా మాటలు అనే వాళ్లు అంటూనే ఉన్నారు.. అందుకే నేను చేయాలనుకున్నది చేస్తూనే ఉంటానని చెప్పింది. ఓ మంచి సినిమా తీశాం, జనాల్లోకి తీసుకెళ్లడానికి బాగా ప్రమోట్ చేస్తున్నామని అభిప్రాయపడింది. ఇంటింటికి వెళ్లి సినిమా చూపించడానికి కూడా మేం రెడీగా ఉన్నామని, పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్‌లో భాగమైన ప్రతి ఒక్కరికీ సొంతిల్లు, కారు ఉండాలని ఆశిస్తున్నట్లు నిహారిక తన డ్రీమ్‌ను బయటపెట్టింది.

Also Read: Peddi Movie: రామ్‌ చరణ్‌ ‘పెద్ది’ వాయిదా? కొత్త రిలీజ్‌ డేట్‌ ఇదే..!

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News