Homeచిత్ర ప్రభNiharika Konidela: హాట్సాఫ్‌ బాబాయ్‌.. పవన్ కల్యాణ్‌పై నిహారిక ప్రశంసల వర్షం..!

Niharika Konidela: హాట్సాఫ్‌ బాబాయ్‌.. పవన్ కల్యాణ్‌పై నిహారిక ప్రశంసల వర్షం..!

Niharika’s interesting comments on Pawan Kalyan: మెగా డాటర్ నిహారిక కొణిదెల తన బాబాయ్, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన ప్రజాసేవ, అంకితభావంపై ప్రశంసల వర్షం కురిపించారు. తన బాబాయ్‌ పవన్‌ కళ్యాణ్‌ సేవా దృక్పథంపై ఆమె ఓ వీడియోను విడుదల చేశారు. పవన్‌ కళ్యాణ్ తన నియోజకవర్గం పిఠాపురంకు చెందిన ప్రజలను తన సొంత కుటుంబంలా చూసుకుంటున్నారని తెలిపారు. అందుకే, పిఠాపురం వెళితే తనకు తన సొంతూరుకు వెళ్ళినట్లుగా అనిపిస్తుందని పేర్కొన్నారు.

- Advertisement -

Also read: EHS Key Orders: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. కొత్త ఈహెచ్‌ఎస్‌ అమలు కోసం సర్కారు కీలక నిర్ణయం..!

ప్రజాసేవలో ఆయనకెవరూ సాటిలేరు..

కాగా, ఇటీవల పిఠాపురంలో ప్రమాదవశాత్తు ఒక ఎలక్ట్రిషియన్ దురదృష్టవశాత్తూ విద్యుదాఘాతంతో చనిపోగా.. ఆయనలా ఎవరికీ జరగకూడదని పవన్‌ కళ్యాణ్‌ గొప్ప నిర్ణయం తీసుకున్నట్లు ఆమె గుర్తు చేశారు. నియోజకవర్గంలోని ఎలక్ట్రిషియన్లందరికీ పవన్ కల్యాణ్ సేఫ్టీ కిట్లు అందజేసినట్లు తెలిపారు. మొత్తం 325 మంది ఎలక్ట్రీషియన్లకు భద్రతా కిట్లను అందజేసినట్లు వెల్లడించారు. ప్రజా సమస్యల పట్ల సకాలంలో స్పందించడంలో డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌కు ఎవరూ సాటిరారని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News