Nithiin – Thammudu Collections: నితిన్ తమ్ముడు మూవీ ఫస్ట్‌డేనే బాక్సాఫీస్ వద్ద డీలా పడింది. నితిన్ కెరీర్‌లోనే తొలి రోజు లోయెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన మూవీగా తమ్ముడు నిలిచింది. ఈ వీక్ టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద నితిన్ మూవీనే భారీ ఎక్స్‌పెక్టేషన్స్‌తో రిలీజైంది. కానీ ప్రీమియర్ నుంచే తమ్ముడు మూవీకి దారుణంగా నెగెటివ్ టాక్ రావడంతో ఫస్ట్ డే కలెక్షన్స్ (Thammudu Collections) పై గట్టిగానే ఎఫెక్ట్ పడింది.
మూడు కోట్ల కలెక్షన్స్…
వరల్డ్ వైడ్‌గా శుక్రవారం రోజు తమ్ముడు మూవీ మూడు కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు సమాచారం. తెలుగు రాష్ట్రాల్లో రెండు కోట్ల వరకు గ్రాస్ వసూళ్లను వచ్చినట్లు చెబుతోన్నారు. రెంటల్స్ పోను షేర్ వాటా అటూ ఇటూగా కోటి ఇరవై నుంచి కోటి ముప్పై లక్షల వరకు ఉంటుందని ట్రేడ్ వర్గాలు చెబుతోన్నాయి. నైజాం మినహా మిగిలిన చోట్ల తమ్ముడు హవా పెద్దగా కనిపించలేదని అంటున్నారు.
రాబిన్‌హుడ్ కంటే…
నితిన్ లాస్ట్ మూవీ రాబిన్‌హుడ్ ఫస్ట్ డే వరల్డ్ వైడ్‌గా 4.80 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. రాబిన్‌హుడ్ కంటే రెండు కోట్ల వరకు తక్కువే తమ్ముడుకు సినిమాకు రావడం ట్రేడ్ వర్గాలను విస్మయపరుస్తోంది. రెండో రోజు కలెక్షన్స్ మరింత తగ్గే అవకాశం ఉందని అంటున్నారు.
బ్రేక్ ఈవెన్ అసాధ్యమే…
తమ్ముడు మూవీ వరల్డ్ వైడ్‌గా ఇరవై నాలుగు కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. 25 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో రిలీజైంది. ఫస్ట్ డే కలెక్షన్స్ చూస్తుంటే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావడం అసాధ్యమనే అనిపిస్తోంది. నితిన్ కెరీర్‌లో మరో డిజాస్టర్ ఖాయంగానే కనిపిస్తోంది.
ALSO READ: https://teluguprabha.net/cinema-news/actress-shobana-doing-key-role-in-ramayana/
శ్రీరామ్ వేణు…
తమ్ముడు మూవీకి శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించారు. అక్కాతమ్ముళ్ల అనుబంధంతో యాక్షన్ అడ్వెంచర్‌గా ఈ మూవీ రూపొందింది. కథలో ఎమోషన్స్ మిస్సవ్వడం, చాలా వరకు సినిమా ఆర్టిఫీషియల్‌గా సాగడం తమ్ముడుకు మైనస్‌గా మారింది. దిల్‌రాజుతో కలిసి శిరీష్ ఈ మూవీని నిర్మించారు. కాంతార ఫేమ్ సప్తమి గౌడ హీరోయిన్‌గా నటించిన ఈ మూవీలో లయ, వర్ష బొల్లమ్మ, స్వసిక కీలక పాత్రలు పోషించారు.
డిజాస్టర్స్…
తమ్ముడు కంటే ముందు నితిన్ నటించిన రాబిన్‌హుడ్, ఎక్స్‌టా ఆర్డినరీ మ్యాన్, మాచర్ల నియోజకవర్గంతో పాటు మరికొన్ని సినిమాలు డిజాస్టర్స్‌గా నిలిచాయి. సక్సెస్ ఎంతో అవసరం అనుకున్న నితిన్.. దిల్ రాజు, శ్రీరామ్ వేణుపై నమ్మకంతో తమ్ముడు సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సక్సెస్‌పై పక్కా అనుకున్న సినిమా ఇలా డిజాస్టర్ కావటంతో నితిన్ సినిమాల ఎంపికపై ఆలోచనలో పడ్డట్టు వార్తలు వినిపిస్తున్నాయి.