Nithiin: టాలీవుడ్ లో టాలెంటెడ్ హీరోగా నితిన్ కి ఎలాంటి పేరుందో అందరికీ తెలిసిందే. యాక్టింగ్ పరంగా, డాన్స్ పరంగా నితిన్ ప్రూవ్ చేసుకున్నాడు. దిల్ లాంటి సినిమాతో ఒక్కసారిగా నితిన్ కి స్టార్ ఇమేజ్ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, భీష్మ తర్వాత మళ్ళీ ఇప్పటి వరకూ ఈ టాలెంటెడ్ హీరోకి హిట్ దక్కలేదు. వేణు శ్రీరాం దర్శకత్వంలో తమ్ముడు సినిమా చేసిన నితిన్ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు.
కానీ, ఈ సినిమా ఫలితం అందరికీ తెలిసిందే. దాంతో దిల్ రాజు బ్యానర్ లో రూపొందాల్సిన ఎల్లమ్మ సినిమా మిస్ అయింది. నితిన్ ఫ్లాప్ రికార్డ్ వల్ల బలగం లాంటి బ్లాక్ బస్టర్ తీసిన వేణు ఎల్దండి, నితిన్ కాంబోలో ఈపాటికే మొదలవ్వాల్సిన ఎల్లమ్మ నితిన్ చేతి నుంచి జారిపోయింది. ఒకప్పుడు ఇలాగే ఫ్లాపుల్లో ఉన్న నితిన్ కి ఇష్క్ సినిమాతో సూపర్ హిట్ ఇచ్చిన విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో ఓ సినిమాను చేస్తున్నాడట.
Also Read – Bandi Saroj Kumar: అఖండ 2 నిర్మాతలపై బండి సరోజ్ ఫైర్..
విక్రమ్ కె కుమార్ చెప్పిన కథ చెప్పినట్టు గనక తీస్తే బ్లాక్ బస్టర్ అని నితిన్ ఇంతకముందు ఓ సందర్భంలో చెప్పాడు. ఇదిలా ఉంటే, లేటెస్ట్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ నీరజ కోన తన రెండవ సినిమాను నితిన్ తో చేసేందుకు ప్లాన్ చేసుకుంటుందట. వాస్తవానికి నీరజ దర్శకత్వంలో వచ్చిన తెలుసు కదా చిత్రం నితిన్ తోనే చెయ్యాల్సింది. కానీ, కుదరలేదు.
ఆ కథనే స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డతో నీరజ సినిమా చేసింది. కానీ, నీరజ డెబ్యూ ‘తెలుసు కదా’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రిజల్ట్ ని అందుకుందో తెలిసిందే. అందుకే, ఈ లేడీ డైరెక్టర్ తో నితిన్ సినిమా చేయబోతున్నాడనే వార్త రాగానే ఫ్లాప్ డైరెక్టర్ తో వద్దని ఫ్యాన్స్ మొత్తుకుంటున్నారట. నీరజ కోన నితిన్ కి అత్యంత సన్నిహితురాలు. మరి ఫ్రెండ్‌షిప్ కోసం ఫ్లాప్ ని కూడా లెక్క చేయకుండా నీరజతో సినిమాను కమిటవుతాడా లేదా అనేది చూడాలి.
Also Read – Rowdy Janardhana: విజయ్ దేవరకొండ రౌడీ జనార్ధనలో విలన్‌గా కోలీవుడ్ హీరో?

