Thursday, July 10, 2025
Homeచిత్ర ప్రభThammudu Movie Review: నితిన్ ‘త‌మ్ముడు’ ట్విట్ట‌ర్ రివ్యూ.. టాక్ ఎలా ఉందంటే!

Thammudu Movie Review: నితిన్ ‘త‌మ్ముడు’ ట్విట్ట‌ర్ రివ్యూ.. టాక్ ఎలా ఉందంటే!

 

- Advertisement -

Nithiin: చాలా కాలంగా మంచి హిట్ కోసం వెయిట్ చేస్తోన్న హీరో నితిన్ హీరోగా న‌టించిన లేటెస్ట్ మూవీ త‌మ్ముడు. శ్రీరామ్ వేణు ద‌ర్శ‌క‌త్వంలో దిల్ రాజు నిర్మాత‌గా రూపొందిన సినిమా ఇది. సిస్ట‌ర్‌, బ్ర‌ద‌ర్ సెంటిమెంట్ ఆధారంగా రూపొందిన సినిమా అని టీజ‌ర్, ట్రైల‌ర్ చూస్తేనే తెలుస్తుంది. శ్రీరామ్ ఇది వ‌ర‌కు చేసిన సినిమాల‌కు డిఫ‌రెంట్‌గా త‌మ్ముడు సినిమాను కాస్త భారీ యాక్ష‌న్ సీక్వెన్స్‌తోనే తెర‌కెక్కించారు. మ‌రి నితిన్ ప‌రాజ‌యాల ప‌రంప‌ర‌కు త‌మ్ముడు బ్రేకులేస్తే బావుంటుంద‌ని అభిమానులు ఆశిస్తున్నారు. దీనిపై సినిమాను చూసిన కొంద‌రు నెటిజ‌న్స్ త‌మ‌దైన అభిప్రాయాల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు.

త‌మ్ముడు ఫ‌స్ట్ హాఫ్ చాలా బావుంది అని ఓ నెటిజ‌న్ సింపుల్‌గా త‌న ఓపినియ‌న్‌ను పోస్ట్ చేశాడు.

చ‌క్క‌టి ప్రొడ‌క్ష‌న్ వేల్యూస్‌తో రూపొందిన ఎమోష‌న‌ల్ జ‌ర్నీగా త‌మ్ముడు సినిమా ఉంద‌ని, నితిన్ కెరీర్ బెస్ట్ పెర్ఫామెన్స్‌తో క‌మ్ బ్యాక్ అయ్యార‌ని, ద‌ర్శ‌కుడు శ్రీరామ్ వేణు సినిమాను హ్యండిల్ చేసిన తీరు చ‌క్క‌గా ఉంద‌ని నెటిజ‌న్ సోషల్ మీడియాలో అభిప్రాయాన్ని చెప్పుకొచ్చారు.

స్టోరీ లైన్ చాలా సింపుల్‌గా ఉంద‌ని, నెరేష‌న్ కూడా ఫ్లాట్‌గా ఉంది. అయితే ద‌ర్శ‌కుడు ఈ క‌థ‌కు ఓ యూనిక్ బ్యాక్ డ్రాప్ ఇవ్వ‌టం అనేది కాస్త కొత్త‌గా ఉంది. అయితే సినిమాలో ఎమోష‌న‌ల్ క‌నెక్టివిటీ మిస్ అయ్యింది అని ఓ నెటిజ‌న్ త‌న ఓపినియ‌న్‌ను షేర్ చేసుకున్నారు.

త‌మ్ముడు మూవీ ఫ‌స్ట్ హాప్ చాలా సూప‌ర్‌గా ఉంద‌ని, సెకండ్ హాఫ్ కోసం వెయిట్ చేస్తున్నామ‌ని, చాలా కాలం త‌ర్వాత నితిన్ క‌మ్ బ్యాక్ అయ్యారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News