Thursday, July 10, 2025
Homeచిత్ర ప్రభThammudu: ‘తమ్ముడు’ నాన్ థియేట్రికల్ బిజినెస్.. బాగానే రాబట్టిన నితిన్

Thammudu: ‘తమ్ముడు’ నాన్ థియేట్రికల్ బిజినెస్.. బాగానే రాబట్టిన నితిన్

Nithiin: టాలీవుడ్ యంగ్ హీరోలలో నితిన్ కి అన్నీ వర్గాల ఆడియన్స్‌లో సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇక పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అభిమానిగా కూడా నితిన్ పవర్‌స్టార్ అభిమానులను తనవైపు తిప్పుకున్నారు. అయితే, ఈ మధ్య కాలంలో ఈ యూత్ స్టార్ నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన సక్సెస్ సాధించడం లేదు. గత చిత్రం రాబిన్ హుడ్ కూడా భారీ అంచనాల మధ్య వచ్చి చతికిలపడింది. శ్రీలీల గ్లామర్, కేతికల ఐటం సాంగ్ కూడా సినిమాను సక్సెస్ వైపు నడిపించలేకపోయాయి.

- Advertisement -

ఈ క్రమంలో నితిన్ ఎన్నో అంచనాలు పెట్టుకొని చేసిన సినిమా తమ్ముడు. భీష్మ తర్వాత నితిన్ కి సక్సెస్ దగ్గరి వరకు వచ్చి ఆగిపోతుంది. దాదాపు నాలుగేళ్లుగా హిట్ ఎలా ఉంటుందో చూడలేదు. వకీల్ సాబ్ సినిమాతో పవర్ స్టార్ కి మంచి హిట్ ఇచ్చిన దర్శకుడు వేణు శ్రీరామ్ నితిన్ తమ్ముడు చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సినిమా.. జులై 4వ తేదీన వరల్డ్ వైడ్ గా రిలీజ్ కి రెడీ అవుతోంది. అప్పుడు పవన్ కళ్యాణ్ కి హిట్ ఇచ్చారు..ఇప్పుడు నితిన్ కి కూడా పక్కా హిట్ ఇస్తారని చెప్పుకుంటున్నారు. ఇక ఈ సినిమాకి పవన్ నటించిన తమ్ముడు సినిమా టైటిల్‌నే పెట్టడం కూడా ప్లస్ పాయింట్.

ALSO READ: https://teluguprabha.net/cinema-news/vishnu-manchu-pan-india-movie-kannappa-review/

తమ్ముడు సినిమాలో హీరోయిన్‌గా కాంతార ఫేమ్ సప్తమి గౌడ నటించింది. కాంతారా సినిమాలో సప్తమి నేచురల్ పర్ఫార్మెన్స్ బాగా ప్లస్ అయింది. అందుకే దర్శకుడు తమ్ముడులో హీరోయిన్‌గా ఎంపిక చేసుకున్నారు. సీనియర్ నటి లయ నితిన్ కి అక్క పాత్రలో కనిపించబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన వీడియోలు, తాజాగా వచ్చిన సాంగ్ మంచి బజ్ క్రియేట్ చేశాయి. అక్కాతమ్ముళ్ల బంధం, యాక్షన్ సీక్వెన్స్ సినిమాకి హైలెట్‌గా నిలవనున్నాయట. వేణు శ్రీరామ్ యాక్షన్ సీన్స్ ఎలా ఉంటాయో నానితో చేసిన ఎంసిఎ, పవన్‌తో చేసిన వకీల్ సాబ్ చూస్తే అర్థం అవుతుంది. నిర్మాత దిల్ రాజు కూడా ఈ సినిమాపై బాగానే అంచనాలు పెట్టుకున్నారు.

అయితే, తమ్ముడు సినిమాపై క్రియేట్ అయిన బజ్ కారణంగా నాన్ థియేట్రికల్ రైట్స్ కి భారీ ఆఫర్ వచ్చిందట. ఆల్మోస్ట్ డీల్ ఫిక్స్ అని సమాచారం. తమ్ముడు ఓటీటీ రైట్స్ నెట్ ఫ్లిక్స్ వాళ్ళు.. శాటిలైట్ రైట్స్ ని స్టార్ మా సొంతం చేసుకున్నట్లు ఇన్‌సైడ్ టాక్. నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారానే ఈ సినిమాకి రూ.38 కోట్లు వచ్చినట్టు తెలుస్తోంది. ఇది మంచి డీల్ అంటున్నారు. ఇంకా ఓటీటీ, శాటిలైట్ లెక్కలు బయటకు రావాల్సి ఉంది. ఇదే నిజమైతే నితిన్ కి వస్తున్న ఫ్లాపులు అతగాడి నెక్స్ట్ సినిమాల మీద ఏమాత్రం ప్రభావం చూపనట్టే అని ఫిక్స్ అవచ్చు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News