Nivetha Pethuraj Breakup: ఒకప్పుడు పెళ్లి అంటే మూడు మూళ్ళ బంధం అనేవారు. కానీ ఇప్పుడు, అది మూడు రోజుల ముచ్చట అయిపోయింది. పెళ్లి వరకు ముందు వెళ్తుందో లేదో వారికి ఒక క్లారిటీ లేకుండానే, ముందు సోషల్ మీడియాలో గ్రాండ్‌గా ‘మేము పెళ్లి చేసుకుంటున్నాము’ అని పోస్ట్ పెడుతున్నారు. ఇంతలోనే, ‘మాకు బ్రేకప్ అయ్యింది, మా ప్రైవసీకి భంగం కలిగించకండి’ అంటూ స్టోరీ పెడుతున్నారు.
ALSO READ: 3 Idiots Sequel: 17 ఏళ్ల తర్వాత తిరిగి వస్తున్న ‘3 ఇడియట్స్’ గ్యాంగ్!
నిన్నటి వరకు క్రికెటర్ స్మృతి మందన, పలాష్ పెళ్లి క్యాన్సిల్ వార్తలు సోషల్ మీడియాను ఊపేశాయి. ఇప్పుడు మరొక జంట తెరపైకి వచ్చింది. టాలీవుడ్‌లో మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకున్న హీరోయిన్ నివేదా పేతురాజ్ పర్సనల్ లైఫ్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండింగ్ అవుతుంది. కొద్ది రోజుల క్రితమే తన లక్కీ ఛార్మ్ అంటూ కాబోయే భర్త ఫోటో షేర్ చేసి, ఎంగేజ్‌మెంట్ హింట్ ఇచ్చింది. ఫ్యాన్స్ అంతా పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటారు అనుకునేలోపే… పెద్ద ట్విస్ట్. నివేదా సడెన్‌గా తన బాయ్ ఫ్రెండ్ ఇన్‌స్టాగ్రామ్‌ను అన్‌ఫాలో చేసి, పాత ఫోటోలన్నీ డిలీట్ చేసింది. అంతేనా, అటు నుంచి రజ్ హిత్ ఇబ్రాన్ కూడా అన్‌ఫాలో చేయడంతో, ఈ లవ్ స్టోరీ ఎండ్‌కార్డ్ పడిందనే టాక్ గట్టిగా నడుస్తోంది.
ALSO READ: Sankranti 2026 Movies: సంక్రాంతి బరిలో ఏకంగా ఐదు సినిమాలు!
నిజానికి, నివేదా పేతురాజ్ వ్యక్తిగత జీవితంపై ఇంత చర్చ జరగడానికి ఇంకో పెద్ద రీజన్ ఉంది. ఈ ఎంగేజ్‌మెంట్ డ్రామాకు ముందు ఆమెకు సంబంధించిన డాగ్ బైట్ ఇష్యూ ఎంత పెద్ద రచ్చ చేసిందో మనందరికీ తెలిసిందే. ‘కుక్క కాటు పెద్ద సమస్య కాదు’ అంటూ అప్పుడు స్టేట్‌మెంట్ ఇచ్చింది కానీ… ఇప్పుడు పర్సనల్ లైఫ్‌లో మాత్రం పెద్ద సమస్యే వచ్చింది అంటూ కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్లు అంత.
మొత్తానికి, నివేదా పేతురాజ్ ఇప్పుడు ఒక రకమైన డబుల్ ట్రబుల్లో పడింది. సెలబ్రిటీస్ పబ్లిక్ లైఫ్‌లో ఉన్నప్పుడు, ప్రతి అడుగు చాలా జాగ్రత్తగా వేయాలి. ఇలాంటి వ్యక్తిగత విషయాలు మీడియాలో రచ్చ అవుతున్నప్పుడు, కనీసం ఒక క్లారిఫికేషన్ ఇచ్చి ఉండాల్సింది. కానీ, ఆ రెస్పాన్స్ కూడా లేకపోవడంతో… ఫ్యాన్స్ మాత్రం ఏం జరుగుతుందో తెలియక గెస్సింగ్ గేమ్ ఆడుకుంటున్నారు. త్వరలోనే నివేదా ఈ సస్పెన్స్‌కు ఎండ్‌కార్డ్ వేస్తుందని ఆశిద్దాం.

