Wednesday, January 8, 2025
Homeచిత్ర ప్రభNayanthara: నయనతారకు నోటీసులు ఇవ్వలేదు: చంద్రముఖి నిర్మాతలు

Nayanthara: నయనతారకు నోటీసులు ఇవ్వలేదు: చంద్రముఖి నిర్మాతలు

రూ.5 కోట్లు డిమాండ్ చేస్తూ హీరోయిన్ నయనతార(Nayanthara)కు చంద్రముఖి నిర్మాతలు నోటీసులు పంపినట్లు వార్తలు హల్‌చల్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ వార్తలపై ఆ నిర్మాతలు స్పందించారు. తాము నయనతారకు ఎలాంటి నోటీసులు పంపలేదని స్పష్టంచేశారు. నయనతార తన డాక్యుమెంటరీ కోసం ముందే ‘నో అబ్జక్షన్‌ సర్టిఫికెట్‌’ తీసుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఎక్స్‌ వేదికగా ఆ సర్టిఫికెట్‌ను షేర్‌ చేశారు.

- Advertisement -

‘నయనతార: బియాండ్‌ ది ఫెయిరీ టేల్‌’(Nayanthara: beyond the fairy tale) తెరకెక్కించే ముందే తమ వద్ద నో అబ్జక్షన్‌ సర్టిఫికెట్‌ తీసుకున్నారని తెలిపారు. డాక్యుమెంటరీలో ‘చంద్రముఖి’లోని సన్నివేశాలను ఉపయోగించడంపై తాము ఎలాంటి నోటీసులు పంపలేదన్నారు. ఈ సన్నివేశాలు ఉపయోగించడంపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని పేర్కొన్నారు.

కాగా ఈ డాక్యుమెంటరీలో తన పర్మిషన్‌ తీసుకోకుండా ‘నానుమ్‌ రౌడీ దాన్‌’ ఫుటేజ్‌ను ఉపయోగించారని ఆరోపిస్తూ చిత్ర నిర్మాత ధనుష్‌ నయనతారకు లీగల్‌ నోటీసులు పంపించిన విషయం తెలిసిందే. రూ.10కోట్లు చెల్లించాలని డిమాండ్ చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News