Sunday, February 8, 2026
Homeచిత్ర ప్రభVaranasi Release Date: 2027లోనే వార‌ణాసి రిలీజ్ - పోస్ట్‌పోన్ రూమ‌ర్ల‌కు చెక్

Varanasi Release Date: 2027లోనే వార‌ణాసి రిలీజ్ – పోస్ట్‌పోన్ రూమ‌ర్ల‌కు చెక్

Varanasi Release Date: మ‌హేష్‌బాబు హీరోగా రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందుతోన్న మూవీ వార‌ణాసి. టైమ్ ట్రావెల్ యాక్ష‌న్ అడ్వెంచ‌ర్ థ్రిల్ల‌ర్ ఎలిమెంట్స్‌తో పాన్ వ‌ర‌ల్డ్ సినిమాగా వార‌ణాసి తెర‌కెక్కుతోంది. దాదాపు 1300 కోట్లతో ఇండియాలోనే భారీ బ‌డ్జెట్ సినిమాల్లో ఒక‌టిగా రాబోతున్న ఈ మూవీ నుంచి అదిరిపోయే అప్‌డేట్‌ను మేక‌ర్స్ రివీల్ చేశారు. ఈ సినిమా రిలీజ్ ఎప్పుడ‌న్న‌ది అనౌన్స్‌ చేశారు. లార్జ్ స్కేల్‌లో రూపొందుతోన్న మూవీ కావ‌డంతో పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు ఆల‌స్యం కానున్నాయ‌ని, అందుకే వార‌ణాసి 2027లో విడుద‌ల‌య్యే అవ‌కాశం లేదంటూ కొద్ది రోజులుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ రూమ‌ర్ల‌కు మేక‌ర్స్ పుల్‌స్టాప్ పెట్టారు. వార‌ణాసి 2027లోనే వ‌చ్చేస్తుంది అంటూ సోష‌ల్ మీడియా ద్వారా క్లారిటీ ఇచ్చారు. అంతే కాకుండా మార్చి 26న ఈ సినిమా నుంచి మ‌రో స్పెష‌ల్ అప్‌డేట్ రాబోతున్న‌ట్లు హింట్ ఇచ్చారు.

- Advertisement -

మార్చి 26న శ్రీరామ‌న‌వ‌మి అవుతోంది. ఈ సినిమాలో మ‌హేష్‌బాబు శ్రీరాముడి లుక్‌లో క‌నిపించ‌బోతున్న‌ట్లు గ్లోబ్ ట్రాట‌ర్ ఈవెంట్‌లో రాజ‌మౌళి ప్ర‌క‌టించారు. శ్రీరామ‌న‌వ‌మి రోజు శ్రీరాముడి పాత్ర‌కు సంబంధించిన లుక్‌ను రివీల్ చేసే అవ‌కాశం ఉన్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. అదే రోజు రిలీజ్ డేట్‌ను కూడా అఫీషియ‌ల్‌గా మేక‌ర్స్ ప్ర‌క‌టించ‌నున్నార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. 2027 ఏప్రిల్ 9న వార‌ణాసి ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

Also Read – Ratha Saptami: రథ సప్తమి నాడు జిల్లెడు ఆకులతో చేసే ఈ పరిహారం తెలుసా!

వార‌ణాసిలో మ‌హేష్‌బాబు రుద్ర అనే క్యారెక్ట‌ర్‌లో క‌నిపించ‌బోతున్నాడు. మ‌ల్టీపుల్ షేడ్స్‌తో ఆయ‌న‌ పాత్ర సాగుతుంద‌ని స‌మాచారం. వార‌ణాసిలో ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా న‌టిస్తోండ‌గా… మ‌ల‌యాళ న‌టుడు పృథ్వీరాజ్ సుకుమార‌న్ విల‌న్‌గా క‌నిపించ‌బోతున్నారు. టాలీవుడ్‌, బాలీవుడ్‌తో పాటు వివిధ భాష‌ల‌కు చెందిన సీనియ‌ర్ యాక్ట‌ర్స్ కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతున్నారు.

వార‌ణాసి మూవీకి ఆస్కార్ విన్న‌ర్ కీర‌వాణి మ్యూజిక్ అందిస్తున్నారు. దుర్గా ఆర్ట్స్ ప‌తాకంపై కేఎల్ నారాయ‌ణ ఈ మూవీని నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం వార‌ణాసి షూటింగ్‌ హైద‌రాబాద్‌లో సాగుతోంది. ఈ ఏడాది సెప్టెంబ‌ర్ క‌ల్లా చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసి పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌ను మొద‌లు పెట్టేందుకు మేక‌ర్స్ స‌న్నాహాలు చేస్తున్నారు.

Also Read – Mohanlal: ‘భ భ బ’ మూవీ రివ్యూ

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News