Nora Fatehi: నోరా ఫతేహీ ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్ అంటూ దుమ్ములేపేస్తోంది. ఎక్కువగా స్పెషల్ సాంగ్స్‌తో ఆడియెన్స్‌ని ఆకట్టుకుంటూ ఉంటుంది. అయితే ఈ బ్యూటీ మీద అప్పట్లో కొన్ని రూమర్లు వచ్చాయి. బడా ప్రొడ్యూసర్‌తో నోరా సన్నిహితంగా ఉంటోందని.. అతనితో రిలేషన్‌లో ఉందని.. అందుకే వరుసగా స్పెషల్ సాంగ్స్‌లో ఆఫర్లు వస్తున్నాయని గాసిప్స్ చక్కర్లు కొట్టాయి. అయితే తాజాగా వీటిపై నోరా నోరు విప్పి స్పందించారు. టీ సిరీస్ అధినేత భూషన్‌తో నోరాకు లింక్ పెడుతూ అప్పట్లో తెగ రూమర్లు వచ్చిన సంగతి తెలిసిందే.
టీ సిరీస్‌లో వచ్చే స్పెషల్ సాంగ్స్‌లో ఎక్కువగా నోరా ఫతేహీ మెరుస్తూ ఉండేది. అందుకే ఇలాంటి రూమర్ బయటకు వచ్చింది. బాహుబలిలో మనోహరి పాటతో తెలుగు వారికి ఎక్కువగా దగ్గరైన ఈ బ్యూటీ ఆ తరువాత స్పెషల్ సాంగ్స్‌కి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది. బాలీవుడ్‌లో దిల్ బర్ పాట ఎంతగా ట్రెండ్ అయిందో అందరికీ తెలిసిందే. ఆ తరువాత థాంక్ గాడ్ చిత్రంలోని మానికే మాగే హితే పాటతోనూ వైరల్ అయింది. మాన్ యాక్షన్ హీరో సినిమాలోని జెహాదా నషా పాటతో అందరినీ మెప్పించింది.
Also Read – Anasuya Bharadwaj: రేప్ చేసిన వారికి మరణశిక్ష అనే బిల్ పాస్ కాదా?.. ఎంపీలపై అనసూయ సెన్సేషనల్ పోస్ట్
అలా నోరా తెలుగు, హిందీ ఆడియెన్స్‌ను తన ఒంపుసొంపులతో ఆకట్టుకుంటూ వస్తోంది. అలాంటి నోరా మీద గతంలో కొన్ని రూమర్లు వచ్చాయి. వాటికి సంబంధించి తాజాగా కొన్ని స్క్రీన్ షాట్లను సోషల్ మీడియాలో ఓ యూజర్ షేర్ చేశాడు. వాటికి నోరా స్పందించింది. నవ్వుతున్న ఎమోజీలను షేర్ చేస్తూ వావ్ అని రియాక్ట్ అయింది. ఇక ఇవన్నీ గాలి వార్తలే అని ఆ నవ్వుతోనే మనం అర్థం చేసుకోవచ్చు.
ప్రస్తుతం ఈ బ్యూటీ కాంచన 4 చిత్రంలో నటిస్తుంది. చివరగా తెలుగులో వరుణ్ తేజ్ మట్కాలో మెరిసింది. కానీ ఆ సినిమా డిజాస్టర్‌గా నిలిచింది. మరి కాంచన 4 అయినా నోరా ఫతేహీకి మంచి విజయాన్ని తెచ్చి పెడుతుందో లేదో చూడాలి. ఇక బాలీవుడ్‌లోనూ నోరా ప్రస్తుతం నెమ్మదించినట్టుగా కనిపిస్తోంది.
Also Read – Dhurandhar2: సినిమా చరిత్రలో అతిపెద్ద మల్టీస్టారర్.. ‘ధురంధర్ 2’పై రామ్ గోపాల్ వర్మ

