ఎన్టీఆర్(NTR) హీరోగా, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబోలో ఓ మూవీ(NTRNeel) రాబోతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీ షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రారంభమైంది. అది కూడా ఓ భారీ స్థాయి యాక్షన్ సీన్‌తో మొదలు కావడం విశేషం. ఇందులో ఏకంగా 3 వేలకుపైగా జూనియర్ ఆర్టిస్టులు పాల్గొంటున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోను మూవీ యూనిట్ పంచుకుంది. దీనికి షూటింగ్ ప్రారంభమైంది అంటూ ఎన్టీఆర్ కూడా తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో షూటింగ్ ఫోటో వైరల్ అవుతోంది.
కేజీఎఫ్ సిరీస్, సలార్ వంటి చిత్రాలతో బ్లాక్ బస్టర్స్ సాధించిన సెన్సేషనల్ డైెరెక్టర్ ప్రశాంత్ నీల్.. ఇప్పుడు తారక్‌తో ఫుల్ యాక్షన్ ఫిల్మ్ తెరకెక్కిస్తుండటంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబో ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తుందోనన్న ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో తెరకెక్కే ఈ పాన్ ఇండియా చిత్రం జనవరి 9, 2026లో విడుదల కానుంది. ఇక ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తగా నిర్మిస్తున్నాయి. భువన్ గౌడ సినిమాటోగ్రఫీ అందిస్తోన్న ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు.