Tuesday, March 11, 2025
Homeచిత్ర ప్రభNTR: కొత్త యాడ్‌లో ఎన్టీఆర్ లుక్‌పై ట్రోల్స్

NTR: కొత్త యాడ్‌లో ఎన్టీఆర్ లుక్‌పై ట్రోల్స్

ఎన్టీఆర్(NTR) ఓవైపు పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం చేతి నిండా భారీ బడ్జెట్ సినిమాలు చేస్తూ యాడ్స్ కూడా చేస్తున్నాడు. ఇప్పటికే పలు యాడ్స్ చేయగా.. తాజాగా మరో కొత్త యాడ్‌తో ప్రేక్షకులు ముందుకొచ్చాడు. గ్రాసరీ సరుకులు డెలివరీ చేసే ప్రముఖ ఆన్‌లైన్ కంపెనీ జెప్టో(Zepto) కంపెనీకి ప్రమోషన్స్‌ యాడ్ చేశాడు.

- Advertisement -

ఈ యాడ్‌లో ఎన్టీఆర్ నెలకు సరిపడా ఒకేసరి సరుకులు జెప్టో ద్వారా ఆర్డర్ చేస్తాడు. అనంతరం పక్కింటి వాళ్లకు కూడా ధరలు తక్కువగా ఉన్నాయి ట్రై చేయండని చిరాకు తెప్పిస్తాడు. ఈ యాడ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఇందులో తారక్ లుక్‌పై విమర్శలు వస్తున్నాయి. ఎన్టీఆర్ షార్ట్ హెయిర్ స్టైల్ దారుణంగా ఉందని కామెంట్స్ చేస్తున్నారు.

ఇక తారక్ సినిమాల విషయానికొస్తే వార్-2, ప్రశాంత్ నీల్ చిత్రాల్లో నటిస్తున్నారు. ఈ రెండు సినిమా షూటింగ్స్‌లో పాల్గొంటున్నారు. ఈ సినిమాల అనంతరం దేవర2, నీల్సన్ దర్శకత్వంలో మరో సినిమాకు కమిట్ అయినట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News