Narne Nithin Marriage NTR: ‘మ్యాడ్’ మూవీ ఫేమ్, ఎన్టీఆర్ బావమరిది(లక్ష్మీ ప్రణతి సోదరుడు) నార్నె నితిన్ వివాహం నేడు ఘనంగా జరిగింది. శివానితో ఏడు అడుగులు నడిచి విహవా బంధంలోకి అడుగుపెట్టాడు. గతేడాది వీరిద్దరి నిశ్చితార్థం జరగ్గా.. ఈరోజు మూడు ముళ్ల బంధంతో ఈ జంట ఒక్కటయ్యారు. కాగా, మ్యాడ్, ఆయ్, మ్యాడ్ స్క్వేర్ సినిమాలతో మూడు హిట్లు ఖాతాలు వేసుకున్న నార్నె నితిన్.. తన నటన, డ్యాన్స్‌తో ఆడియన్స్‌తో శభాష్ అనిపించుకున్నాడు.
#JrNTR from #NarneNithin's wedding !!
— Filmy Tollywood (@FilmyTwoodOffl) October 10, 2025
కాగా శివాని.. విక్టరీ వెంకటేష్ కుటుంబానికి బంధువులైన తాళ్లూరి వెంకట కృష్ణ ప్రసాద్, స్వరూప దంపతులు కుమార్తె. హైదరాబాద్ శివారులో శంకర్‌పల్లిలో ఘనంగా జరిగిన ఈ పెళ్లి వేడుకలో ఎన్టీఆర్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాడు. బావమరిది పెళ్లి సందర్భంగా షూటింగ్స్ నుంచి బ్రేక్ తీసుకున్న ఎన్టీఆర్ అన్నీ తానై దగ్గరుండి చూసుకున్నాడు. అతిథులను సాదరంగా ఆహ్వానించాడు.
Also Read: https://teluguprabha.net/cinema-news/funky-teaser-review-vishwak-sen-anudeep-kv/
ఈ వివాహానికి పలువురు సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు హాజరయ్యారు. తాజాగా ఈ పెళ్లి నుంచి కొన్ని వీడియోలు లీక్ అయ్యాయి. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

