ఎన్టీఆర్(NTR) సతీమణి లక్ష్మీ ప్రణతి పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆమెకు తారక్ సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రస్తుతం ‘దేవర’ మూవీ ప్రమోషన్స్ కోసం జపాన్‌లో ఎన్టీఆర్ దంపతులు ఉన్నారు. ఈనెల 28న జపానీస్ భాషలో దేవర విడుదల కానుంది. దీంతో మూవీ ప్రమోషన్స్‌లో తారక్ బిజీగా ఉన్నారు. గత మూడు రోజులుగా జపనీయులతో కలిసి తెగ సందడి చేస్తున్నారు.
ఈ క్రమంలో ప్రణతి పుట్టినరోజు సందర్భంగా జరిగిన వేడుకలకి సంబంధించిన పిక్స్ షేర్ చేస్తూ “అమ్మలు… హ్యాపీ బర్త్‌డే” అంటూ బర్త్ డే విషెస్ తెలిపారు. ఈమేరకు ఫొటోలను షేర్ చేశారు. ఇప్పుడీ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఫ్యాన్స్, సెలబ్రెటీలు తమ అభిమాన హీరో భార్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ఇక తారక్ సినిమాల విషయానికొస్తే ఇటీవలే ‘వార్ 2’ చిత్రంలో షూటింగ్ పూర్తి చేసుకున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్‌తో కలిసి నటించిన ఈ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. త్వరలోనే ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న చిత్రంలోనూ జాయిన్ కానున్నారు. దీంతో పాటు దేవర 2 చిత్రానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.