Nuvvu Naaku Nachav Re Release: తెలుగు ప్రేక్షకుల ఫేవరెట్ లిస్ట్‌లో ఎప్పుడూ టాప్‌లో ఉండే సినిమా ‘నువ్వు నాకు నచ్చావ్’. వెంకటేష్ కెరీర్లో సూపర్‌హిట్ అయిన ఈ క్లాసిక్, వచ్చే కొత్త సంవత్సరంలో ప్రేక్షకులకు న్యూ ఇయర్ ట్రీట్ ఇవ్వడానికి వస్తోంది. 2001లో వచ్చిన ఈ సినిమాను, ఈసారి ఫుల్ 4K టెక్నికల్ హంగులతో రీ రిలీజ్ చేస్తున్నారు. జనవరి 1, 2026 నాడు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది.
ALSO READ: Harish Shankar: DSPపై హరీష్ శంకర్ కామెంట్స్.. థమన్‌ని ఉద్దేశించేవేనా?
ఈ సినిమాకు ఇంత క్రేజ్ రావడానికి ముఖ్య కారణం త్రివిక్రమ్, విజయ భాస్కర్, వెంకటేష్ కాంబినేషన్. ‘నువ్వే కావాలి’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత, త్రివిక్రమ్, విజయ భాస్కర్ ఫుల్ జోష్‌తో చేసిన సినిమా ఇది. త్రివిక్రమ్ అందించిన డైలాగ్‌లు ఇప్పటికీ ట్రెండింగ్‌లో ఉన్నాయి. వెంకటేష్ తన వింటేజ్ కామెడీ టైమింగ్‌తో వెంకీ పాత్రలో ఇరగదీశాడు.
ప్రకాశ్ రాజ్, వెంకటేష్ మధ్య కామెడీ సన్నివేశాలు ఇప్పటికీ నవ్వు తెప్పిస్తాయి. “అడక్కుండానే జన్మను ఇచ్చావు.. ఏడిస్తే పాలించావు… అయినా నువ్వు నాకు నచ్చావ్… కానీ ఎందుకమ్మా ఇంత ఎర్లీగా చచ్చావు”. ఈ డైలాగ్ ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది. అలాగే సినిమాలో దివంగత నటి ఆర్తి అగర్వాల్ అమాయకత్వం, నటన ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఈ పాత్రలన్నీ కలిసి ఈ సినిమాను ఒక ఫీల్ గుడ్ క్లాసిక్గా నిలబెట్టాయి.
ALSO READ: The Paradise: సైలెంట్ కాదు.. సెట్లో మాన్‌స్టర్.. ఓదెల బర్త్‌డే గ్లింప్స్ గూస్‌బంప్స్
ఈ రీ రిలీజ్‌లో బిగ్గెస్ట్ అట్రాక్షన్ దాని గ్లోబల్ రిలీజ్. అప్పట్లో విదేశాల్లో ఈ సినిమా పూర్తి స్థాయిలో విడుదల కాలేదు. ఆ లోటును తీరుస్తూ, జనవరి 1 నాడు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుండడం ఓవర్సీస్ ఫ్యాన్స్‌కి న్యూ ఇయర్ ధమాకా. 4K క్వాలిటీ, డాల్బీ అట్మాస్ సౌండ్‌తో కోటి సంగీతం, సిరివెన్నెల- భువన చంద్రల ఎవర్ గ్రీన్ పాటలు వింటే ఆ వైబ్స్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటాయి.
ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, సునీల్, ఎం.ఎస్. నారాయణ వంటి నటులు పోషించిన ఐకానిక్ పాత్రలు మళ్లీ పెద్ద తెరపై నవ్వులు పూయించడం ఖాయం. కొత్త సంవత్సరంలో ఈ ప్యూర్ కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్న సినిమాతో ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ చేయడం కంటే బెస్ట్ ఏముంటుంది?

