మహా కుంభామేళాలో మిల్కీ బ్యూటీ తమన్నా సందడి చేశారు. ఓదెల2 (Odela2) టీజర్ లాంఛ్ నేపథ్యంలో ఆమెతో పాటు దర్శకుడు సంపత్ నంది, యాంకర్ సుమ ఇతర నటీనటులు ఉన్నారు. కాగా కుంభమేళాలో టీజర్ రీలీజ్ అయిన తొలిచిత్రం ఇదే కావడం గమనార్హం.
టాలీవుడ్ ప్రముఖ దర్శకుల్లో ఒకరైన సంపత్ నంది తెరకెక్కించిన చిత్రాల్లో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో చేసిన “రచ్చ” కూడా ఒకటి. అయితే ఈ సినిమాలో నటించిన మిల్కీ బ్యూటీ తమన్నాతో ఇపుడు సోలోగా ఒక సాలిడ్ ప్రాజెక్ట్ ని అయితే చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ చిత్రమే “ఓదెల 2”.
అశోక్ తేజ దర్శకత్వంలో తమన్నా (Tamannaa) ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఓదెల 2’ (Odela 2). హెబ్బా పటేల్, వశిష్ఠ ఎన్.సింహ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్‌ను మహాకుంభ మేళాలో విడుదల చేశారు. ఇక ఈ చిత్రానికి అజనీష్ లోకనాథ్ సంగీతం అందిస్తుండగా మధు క్రియేషన్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు. అలాగే త్వరలోనే నేషనల్ వైడ్ గా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
శివ శక్తిగా తమన్నా నటన ప్రేక్షకులను ఆశ్చర్యపరిచేలా సాగింది. ఉత్కంఠ రేకేత్తించే సన్నివేశాలతో టీజర్ ఆద్యంతం అలరించేలా ఉంది. 2022లో విడుదలైన ‘ఓదెల రైల్వే స్టేషన్’ చిత్రానికి కొనసాగింపుగా ఈ చిత్రం రూపొందుతోంది. మరి ఈ సినిమాలో తమన్నా ఒక అఘోరి పాత్రలో కనిపిస్తుండగా ఈ సినిమా నుంచి మేకర్స్ టీజర్ ని మహా కుంభమేళాలో విడుదల చేస్తున్నట్టుగా రీసెంట్ గా అనౌన్స్ చేశారు. అన్నట్టుగానే ఈ ఉదయం రీలీజ్ చేశారు.
కుంభమేళాలోనే ఒక 102 ఏళ్ల నాగ సాధుతో ఈ టీజర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. మరి ఈ టీజర్ ఇప్పుడు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.