Monday, July 14, 2025
Homeచిత్ర ప్రభSuhas New Movie: హీరో సుహాస్‌ 'ఓ భామ అయ్యో రామ' ట్రైలర్‌ వచ్చేసింది!!

Suhas New Movie: హీరో సుహాస్‌ ‘ఓ భామ అయ్యో రామ’ ట్రైలర్‌ వచ్చేసింది!!

Suhas New Movie: సినిమా సినిమాకు డిఫరెంట్‌ టాపిక్స్‌ను ఎంచుకుంటూ తనకంటూ ఓ మార్క్ క్రియేట్ చేశాడు కథనాయకుడు సుహాస్. ఆయన తాజాగా నటించిన చిత్రం ‘ఓ భామ అయ్యో రామ’. రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనింగ్ జోనర్‌లో రూపొందిన ఈ చిత్రం ‘ఓ భామ అయ్యో రామ’. మలయాళంలో ‘జో’ అనే చిత్రంతో అందరి హృదయాలను దోచుకున్న నటి మాళవిక మనోజ్ (జో ఫేమ్) ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయం కానున్నారు. రామ్ గోధల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని వీ ఆర్ట్స్‌ పతాకంపై హరీష్‌ నల్ల నిర్మిస్తున్నారు. జూలై 11న చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

- Advertisement -

ఈ నేపథ్యంలో ఈ చిత్ర ట్రైలర్‌ను మేకర్స్ శనివారం విడుదల చేశారు. ట్రైలర్‌ను గమనిస్తే.. ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎమోషన్‌‌తో పాటు హీరో, హీరోయిన్స్‌ ఎనర్జీ సూపర్‌గా ఉంది. నేటి తరం ప్రేక్షకులతో పాటు అన్ని వర్గాల వారిని అలరించే ఫుల్‌ ప్యాకేజీగా రూపొందించారని తెలుస్తోంది.

చిత్ర ట్రైలర్ రిలీజ్ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ.. ” ట్రైలర్‌ విడుదలైన కొద్ది సమయంలోనే మంచి రెస్పాన్స్ వస్తోంది. ట్రైలర్‌ చూసిన వారు ఈ మూవీ కచ్చితంగా విజయం సాధిస్తుందంటే అంటుంటే ఆనందంగా ఉంద”ని అన్నారు.
హీరో సుహాస్‌ కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌తో రూపొందుతున్న సినిమా ఇదే కావడం విశేషం.
ఈ చిత్ర దర్శకుడు మాట్లాడుతూ.. “ఇటీవల విడుదలైన ప్రమోషన్‌ కంటెంట్‌కు మంచి స్పందన లభిస్తోంది. ఓ క్వాలిటీ సినిమాను ప్రేక్షకులకు ఇచ్చేందుకు నిర్మాత ఎంతో కష్టపడ్డారు. ఎక్కడా రాజీ పడలేదు. ఈ సినిమా ఇంత క్వాలిటీగా రావడానికి ఆయనే కారణం. మణికందన్‌ ఫోటోగ్రఫీతో పాటు రథన్‌ ఈ స్టోరీకి మంచి సంగీతాన్ని అందించారు” అని అన్నారు. ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ ఈ చిత్రంలో అతిథి పాత్రలో కనిపించబోతున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News