‘గేమ్ ఛేంజర్’ మూవీతో కాస్త నిరాశపడిన గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్(Ram charan) అభిమానులకు శుభవార్త. చరణ్ నటించిన క్యూట్ లవ్ స్టోరీ చిత్రం మరోసారి రిలీజ్ కానుంది. ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆరెంజ్'(Orange Movie) మూవీకి ఇప్పటికీ సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్ పై నాగబాబు నిర్మించిన ఈ చిత్రం 2010లో విడుదలైంది. అప్పట్లో ఈ చిత్రంలోని పాటలు యూత్‌ను ఓ ఊపు ఊపేశాయి. ఇప్పటికీ ఎక్కడో చోట ఈ పాటలు వినిపిస్తూనే ఉంటాయి. అయితే ఈ సినిమా స్టోరీ అప్పటి ప్రేక్షకులకు అంతగా కనెక్ట్ కాలేదు.
అయితే గతేడాతి చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేయగా అద్భుతమైన సందన వచ్చింది. థియేటర్లలో అభిమానులు పాటలు పాడుతూ డ్యాన్స్‌లు చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక రీరిలీజ్ ద్వారా వచ్చిన మొత్తాన్ని జనసేన పార్టీకి విరాళంగా ఇచ్చారు. ఇదిలా ఉంటే ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈ చిత్రాన్ని మరోసారి రీ రిలీజ్ చేయనున్నారు. ఈ విషయం తెలిసి అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. వాలెంటైన్స్ డే రోజు తమ లవర్స్‌తో ఓ రేంజ్‌లో ‘ఆరెంజ్’ మూవీ చూసేందుకు రెడీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.