Saturday, May 25, 2024
Homeచిత్ర ప్రభOscars: లైమ్ లైట్ లోకి దీపిక కొత్త టాటూ.. అరే.. పాత టాటూ ఏదీ దీపికా?

Oscars: లైమ్ లైట్ లోకి దీపిక కొత్త టాటూ.. అరే.. పాత టాటూ ఏదీ దీపికా?

ఆస్కార్ అవార్డుల ప్రెజెంటర్ గా ఆస్కార్ వేడుకలకు హాజరైన దీపిక పదుకున్ కొత్త టాటూ ఇప్పుడు అందరూ భలే డిస్కస్ చేసుకుంటున్నారు. ఈ దివాకు టాటూలంటే చాలా ఇష్టం. అందుకే రెగ్యులర్ గా ఏదో ఒక కొత్త టాటూ వేయించుకుని వాటిని భలే డిస్ప్లే చేస్తుంటారు దీపికా. లేటెస్ట్ గా ఆమె వేసుకున్న టాటూను ఫస్ట్ టైం పబ్లిక్ గా రివీల్ చేశారు దీపిక. ఆస్కార్ అవార్డ్స్ ప్రెజెంటర్ గా ఆమె వేసుకున్న డ్రెస్ తో పాటు ఆమె కొత్త టాటూ కూడా బాగానే హైలైట్ అయింది.

- Advertisement -

ఇక రణబీర్ కపూర్ తో రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు ఆమె ఆర్కే అనే టాటూ వేయించుకుంది. పెళ్లయ్యాక కూడా ఆ టాటూ అలాగే ఉండేది. కానీ లేటెస్ట్ గా ఆ టాటూ కాస్త మాయమై.. మెడపైన కొత్త చిన్న టాటూ కనిపించటం హైలైట్.

అకాడమీ అవార్డుల ప్రదానంతో పాటు ఆతరువాత జరిగే ఆఫ్టర్ పార్టీ కూడా చాలా ప్రెస్టీజియస్ గా సెలబ్రిటీలు భావిస్తారు. ఈ పార్టీలో దీపిక్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు. మీకు గుర్తుంది కదా దీపిక కొన్ని హాలీవుడ్ సినిమాల్లోనూ యాక్ట్ చేశారు. కానీ బాలీవుడ్ పైనే ఆమెకు ప్రేమ ఎక్కువ. దీంతో ఆఫర్స్ ఉన్నా ఆమె హాలీవుడ్ పై ఫోకస్ పెట్టట్లేదు.

దీపికా పదుకున్ కొత్త టాటూ, ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవంలో లూయిస్ విట్టన్ డ్రెస్ లో బుట్టబొమ్మలా మెరుస్తూ తన కొత్త టాటూ చూపిన బ్యూటీ
దీపికా పదుకున్ పాత టాటూ, ఇందులో ఆర్.కె. అనే అక్షరాలు స్పష్టంగా కనిపిస్తాయి
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News