స్టార్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్(Anupama Parameswaran) ప్రధాన పాత్రలో ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘పరదా'(Paradha Teaser). గతంలో ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేయగా తాజాగా మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ఈ టీజర్‌ను విడుదల చేశారు. ఈ సినిమాలో మలయాళీ హీరోయిన్ దర్శన రాజేంద్రన్, సీనియర్ నటి సంగీత ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
- Advertisement -
ఇక ఈ టీజర్ చూస్తుంటే పల్లెటూళ్లలో ఉండే కట్టుబాట్లు, ఊరి సమస్య, సమస్య నెరవేరుతుందా అనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కించినట్టు తెలుస్తోంది. ఈ సినిమాని తెలుగు, మలయాళంలో రిలీజ్ చేయనున్నారు.