Patang Movie Trailer: ఇన్ స్టాగ్రామ్ ఫేమ్ ప్రీతి పగడాల, జీ సరిగమప రన్నరప్ ప్రణవ్ కౌశిక్, వంశీ పూజిత్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నా మూవీ ‘పతంగ్’ ఈ సినిమా డిసెంబర్ 25న క్రిస్మస్ కానుకగా విడుదల కానుంది. వీరంతా కొత్తవాళ్లే అయినప్పటికీ, సినిమా కథ ఆసక్తికరంగా ఉండటంతో ప్రేక్షకుల్లో దీనిపై మంచి బజ్ ఉంది. ప్రణీత్ ప్రత్తిపాటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో, ప్రముఖ గాయకుడు ఎస్.పి. చరణ్ కూడా ఒక ముఖ్యమైన పాత్రలో కనిపిస్తున్నారు.
రీసెంట్‌గా విడుదలైన ఈ సినిమా ట్రైలర్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ సినిమా ముఖ్యంగా కామెడీ, స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంతో రూపొందింది. కథ మొత్తం పతంగుల పోటీ చుట్టూ తిరుగుతూ, విభిన్నంగా ఉంటుందని తెలుస్తోంది. ట్రైలర్ చూస్తే, ఇద్దరు హీరోలు ఒకే హీరోయిన్‌ను ప్రేమించడం ప్రధాన అంశంగా కనిపిస్తోంది. చివరికి ఆ పతంగ్ పోటీలో ఏమైంది అనేది ప్రేక్షకులకు ఆసక్తిని కలిగిస్తోంది.
‘పతంగ్’ సినిమా నిర్మాణంలో క్వాలిటీ విషయంలో మేకర్స్ రాజీ పడలేదని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. సినిమా విజువల్స్ చాలా కలర్‌ఫుల్‌గా ఉన్నాయి, ఇది సినిమాకు ఒక ప్రత్యేక ఆకర్షణ. అలాగే, జోస్ జిమ్మి అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా కథకు బాగా సెట్ అయింది. కొత్త నటీనటులు అయినా, వాళ్ల పెర్ఫార్మెన్స్ చాలా సహజంగా, సెటిల్డ్‌గా ఉంది.
ALSO READ: Akhanda 2: ‘అఖండ 2 ‘ ప్రొడ్యూసర్స్ మిస్సింగ్!
ఈ సినిమాను విజయ్ శేఖర్ అన్నే, సంపత్, సురేష్ కొత్తింటి, నాని బండ్రెడ్డి నిర్మించగా, ప్రముఖ నిర్మాత డి. సురేష్ బాబు సమర్పిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ పూర్తయి, పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుని ప్రమోషన్స్ జరుపుతున్నారు. ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ రావడంతో, ఈ యూత్‌ఫుల్ స్టోరీ థియేటర్‌లో విజయం సాధిస్తుందని అందరూ ఆశిస్తున్నారు.

