Saturday, July 6, 2024
Homeచిత్ర ప్రభPathaan: 17 ఏళ్ల తరువాత థియేటర్లో 50 రోజులు ఆడిన ఏకైక సినిమా

Pathaan: 17 ఏళ్ల తరువాత థియేటర్లో 50 రోజులు ఆడిన ఏకైక సినిమా

ఈమధ్య కాలంలో థియేటర్లో ఏ సినిమా అయినా ఎన్ని రోజులు ప్రదర్శిస్తారు ? మహా అయితే మల్టీప్లెక్స్ లో ఓ 2-3 వారాలు ఆడితేనే చాలా ఎక్కువ. అప్పుడే ఆ సినిమా కమర్షియల్ గా సూపర్ అండ్ బ్లాక్ బస్టర్ హిట్ అయిందని లెక్క. కానీ 17 ఏళ్ల తరువాత పఠాన్ సినిమా 50 రోజులపాటు థియేటర్లో ప్రదర్శించటం అతి పెద్ద విశేషం. ఎందుకంటే 17 ఏళ్ల క్రితం హిందీ సినిమా క్రిష్ ఒక్కటే ఇలా 50 రోజులపాటు స్క్రీన్ అయింది. ఆతరువాత సినిమాలన్నీ రావటం, కలెక్షన్స్ చుట్టేసుకోవటం ..అంతే. కానీ అన్ని రకాల రికార్డులు తిరగరాసిన పఠాన్ మాత్రం ఇలా 50 రోజులు ఆడటంతో థియేటర్స్ మళ్లీ కళకళలాడే రోజులు వచ్చాయని ఫిల్మ్ మేకర్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. కేబుల్, ఇంటర్నెట్, ఓటీటీ ప్లాట్ ఫామ్స్ వచ్చాక థియేటర్లో ఎంత గొప్ప సినిమా అయినా ఇలా 50 రోజులు స్క్రీన్ కావటం లేదు.

- Advertisement -

కాగా పఠాన్ సినిమా రిలీజ్ అయినప్పటి నుంచీ బిహార్ లో 50 రోజుల పాటు స్క్రీన్ అవుతుండటం హైలైట్ న్యూస్ గా మారింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News