Sunday, July 7, 2024
Homeచిత్ర ప్రభPathaan: 540 కోట్లు దాటిన పఠాన్ వసూళ్లు, సీక్వెల్ కూడా

Pathaan: 540 కోట్లు దాటిన పఠాన్ వసూళ్లు, సీక్వెల్ కూడా

చాలా వేగంగా 300 కోట్ల రూపాయల బడ్జెట్ మూవీగా రికార్డు సృష్టించిన పఠాన్ సినిమా నిన్నటికి ప్రపంచ వ్యాప్తంగా 540 కోట్ల రూపాయల వసూళ్లు అధిగమించింది. ఒకే రోజులో 70 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి బాలీవుడ్ సినిమాగా పఠాన్ సరికొత్త రికార్డు సృష్టించింది. బాలీవుడ్స్ బిగ్గెస్ట్ ఓపెనర్ గా నిలిచిన షారూఖ్ సినిమా కరోనా తరువాత అతి పెద్ద మొత్తాలు వసూలు చేసిన మొట్టమొదటి సినిమాగానూ చరిత్ర సృష్టించింది.

- Advertisement -

దీంతో మొట్టమొదటిసారి షారూఖ్ కూడా 300 కోట్ల క్లబ్ లో చోటు సంపాదించారు. దంగల్, పీకీ సినిమాల వసూళ్లు 300 కోట్ల రూపాయలు దాటడంతో అమీర్ ఖాన్, టైగర్ జిందా హై, సుల్తాన్, బజరంగీ భాయీజాన్ 300 కోట్ల క్లబ్ లో చేరగా సల్మాన్ ఖాన్ లు ఉన్న లిస్టులోకి సూపర్ స్టార్ షారూఖ్ కూడా వచ్చి చేరారన్నమాట.

సినిమా సక్సెస్ మీట్ లో మనసు విప్పి మాట్లాడిన కింగ్ ఖాన్ నాలుగేళ్లుగా హిట్లు లేని తన కెరీర్ కు కరువు తీరేలా ఈ నాలుగు రోజులు తన కెరీర్ లో నిలిచిపోతాయన్నారు. ఇక పఠాన్ విలన్ జాన్ అబ్రహంతో బ్రొమాన్స్ చేసిన బాలీవుడ్ బాద్షా ప్రెస్ మీట్ లో దీపికా పదుకున్, జాన్ అబ్రహంపై ప్రశంసల వర్షం కురిపిస్తూ ముద్దులు పెట్టాడు. పఠాన్ కు సీక్వెల్ ఉంటుందని హింట్ ఇచ్చిన ఎస్ఆర్కే, పఠాన్ సీక్వెల్ లో నటించడాన్ని గౌరవంగా భావిస్తానన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News