Pawan Kalyan Claps to Megastar 158 Film: హైదరాబాద్‌లో మెగా ఈవెంట్ జరిగింది. మెగాస్టార్ చిరంజీవి 158వ చిత్రానికి సంబంధించిన ప్రారంభ వేడుకను ఆ చిత్ర బృందం ఘనంగా నిర్వహించింది. ‘మెగా 158’ అనే వర్కింగ్ టైటిల్ తో పిలుచుకుంటున్న ఈ చిత్రాన్ని నేడు పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి దర్శకుడు బాబీ కొల్లితో పాటు చిత్ర బృందం మొత్తం హాజరయ్యారు. ఈ సినిమాను ఏపీ డిప్యూటీ సీఎం, చిరంజీవి సోదరుడు పవన్ కళ్యాణ్ క్లాప్ కొట్టి అధికారికంగా ప్రారంభించారు. ఆయన క్లాప్ ఇవ్వడంతో మెగా అభిమానుల్లో భారీ ఉత్సాహం నెలకొంది. కేవీఎన్ ప్రొడక్షన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. గతంలో వాల్తేరు వీరయ్యతో హిట్ అందుకున్న చిరంజీవి-బాబీ కాంబినేషన్ మళ్లీ కొత్త చిత్రంతో వస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మొత్తానికి ఈ లాంచింగ్ ఈవెంట్‌తో మెగా 158 సినిమాపై అభిమానుల్లో భారీ హైప్ నెలకొంది. ఈ చిత్ర ప్రారంభోత్సవానికి మరో మెగా బ్రదర్ నాగబాబు సైతం హాజరయ్యారు. దీంతో, ముగ్గురు బ్రదర్స్ ఒకే ఫ్రేమ్‌లో కనిపించడంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఇప్పుడీ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
Also read: CM Chandrababu: పార్టీ కార్యకర్తే అధినేత.. మహానాడుపై సమీక్షలో సీఎం కీలక సూచనలు

