Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటుడు ప్రకాశ్ రాజ్‌కు సోషల్ మీడియా వేదికగా సానుభూతి ప్రకటించారు. ఆయన తల్లి మరణవార్త తెలిసి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాగా విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ తల్లి సువర్ణలత ఈ రోజు ఉదయం కన్నుమూసిన సంగతి తెలిసిందే. వయోభారం సమస్యలతో బాధపడుతున్న ఆమె బెంగళూరులోని తమ నివాసంలో మరణించారు.
పవన్ సంతాపం
ఆమె మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ సినీ,రాజకీయ ప్రముఖులు ప్రకాశ్ రాజ్‌కు సంతాపం తెలుపుతున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ ట్వీట్ చేస్తూ.. “ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ గారి మాతృమూర్తి శ్రీమతి సువర్ణలత గారు కన్నుమూశారని తెలిసి చింతించాను. శ్రీమతి సువర్ణలత గారి ఆత్మకి శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. మాతృ వియోగానికి లోనైన శ్రీ ప్రకాష్ రాజ్ గారికి, ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను” అని తెలిపారు.
రాజకీయ ప్రత్యుర్థులుగా..
కాగా సినీ ఇండస్ట్రీలో మంచి స్నేహితులైన ప్రకాశ్ రాజ్, పవన్ కళ్యాణ్‌లు.. రాజకీయాల్లో మాత్రం పత్యర్థులనే విషయం తెలిసిందే. తరచూ ప్రకాశ్ రాజ్ పవన్ కళ్యాణ్ రాజకీయాలపై ఛలోక్తులు పేలుస్తుంటారు. కానీ, పవన్ మాత్రం ఎప్పుడు ఆయన విషయంలో సైలెంట్‌గానే ఉంటూ గౌరవం ఇస్తుంటారు. తరచూ వీరద్దరి మధ్య రాజకీయ వైరం ఉన్న వ్యక్తిగత విషయంలో మాత్రం ఒకరిపట్ల ఒకరు సానుకూలంగా స్పందిస్తుంటారు. ఇక ఇప్పుడ ప్రకాశ్ రాజ్ తల్లి మరణంతో పవన్ కళ్యాణ్ ఆయనకు సానుభూతిని తెలపడంతో అందరి దృష్టిని ఆకట్టుకుంటోంది.
ప్రముఖ నటుడు శ్రీ @prakashraaj గారి మాతృమూర్తి శ్రీమతి సువర్ణలత గారు కన్నుమూశారని తెలిసి చింతించాను. శ్రీమతి సువర్ణలత గారు ఆత్మకి శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. మాతృ వియోగానికి లోనైన శ్రీ ప్రకాష్ రాజ్ గారికి, ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి…
— Deputy CMO, Andhra Pradesh (@APDeputyCMO) March 30, 2026

